Site icon HashtagU Telugu

Mizoram Polls : ఓటు వేయకుండానే వెనుదిరిగిన మిజోరం సీఎం..ఎందుకంటే

Mizoram Cm Zoramthanga

Mizoram Cm Zoramthanga

మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ (Mizoram CM Zoramthanga) కు చేదు అనుభవం ఎదురైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జోరాంతంగ ప్రయత్నించగా ఈవీఎం మోరయించింది. దీంతో ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్, మిజోరం (Chhattisgarh , Mizoram elections) రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఛత్తీస్​గఢ్​లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. మిజోరం లో మొత్తం 40 స్థానాలకు గాను పోలింగ్ జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మిజోరం ముఖ్యమంత్రి , మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు జోరాంతంగ కు చేదు అనుభవం ఎదురైంది. ఉదయం ఐజ్వాల్‌ నార్త్‌-2 నియోజకవర్గ పరిధిలోని 19-ఐజ్వాల్‌ వెంగ్లాయ్‌-1 పోలింగ్‌ కేంద్రానికి జోరాంతంగ వెళ్లారు.. అయితే అక్కడి ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. కొంతసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. టిఫిన్‌ చేసిన తర్వాత ఓటేసేందుకు మళ్లీ వస్తానని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వం పూర్తి స్థాయి మోజార్టీ సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వస్తే మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన శరణార్థులకు పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం మిజోరాం 32,492 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. అలాగే మణిపూర్ నుంచి వచ్చి తలదాచుకుంటున్న 11,991మందికి కూడా ఆశ్రయమిస్తోంది. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, మిజొరాంలో ఆశ్రయం పొందుతున్న మణిపూర్ వాసులకు ఇళ్లు కట్టించి ఇస్తామని జొరామ్ తంగా హామీ ఇచ్చారు.

Read Also : Chhattisgarh Assembly Elections : ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల వేళ.. సుక్మాలో పేలిన ఐఇడి బాంబు