Site icon HashtagU Telugu

Mizoram CM : మిజోరం సీఎం ఓటమి.. కొత్త సీఎంగా జెడ్‌పీఎం చీఫ్

Mizoram Cm

Mizoram Cm

Mizoram CM : మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫలితం వచ్చింది. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం, మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి జోర‌మ‌తంగ ఓడిపోయారు. 2,100 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్‌-1 స్థానం నుంచి పోటీ చేసిన  సీఎం జోర‌మ‌తంగపై.. జోరం పీపుల్స్ మూమెంట్‌(జెడ్‌పీఎం) పార్టీ అభ్య‌ర్థి లాల్‌త‌న్ సంగ ఘన విజ‌యం సాధించారు. ఈ ఎన్నికలో లాల్‌త‌న్‌సంగ‌కు 10,727 ఓట్లు పోల్ కాగా, జోర‌మ‌తంగ‌కు 8626 ఓట్లు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

మొత్తం 40 స్థానాలు ఉన్న మిజోరం అసెంబ్లీలో 27 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ జెడ్‌పీఎం ఆధిక్యంలో ఉంది. ఇక అధికార మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌ (ఎంఎన్ఎఫ్) పార్టీ  10 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒకచోట లీడ్‌లో ఉన్నాయి. జెడ్‌పీఎం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబురాలు ప్రారంభించాయి. ZPM వ్యవస్థాపకుడు లాల్దుహోమా మిజోరం తదుపరి సీఎం అవుతారని తెలుస్తోంది.

Also Read: A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

ఈ ఫలితంపై ZPM పార్టీ సీఎం అభ్యర్థి లాల్దుహోమా మీడియాతో మాట్లాడుతూ.. “మిజోరాం ప్రజలు కోరుకున్న మార్పు ఇదే. దీనికి చాలా కారణాలున్నాయి. అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు. సీబీఐ సహాయంతో అవినీతిని అరికట్టడం మా మొదటి ప్రాధాన్యత. మేం రాబోయే 100 రోజులకు మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతలను రేపు అధికారికంగా ప్రకటిస్తాం’’ అని వెల్లడించారు. లాల్దుహోమా తొలుత గోవాలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత దేశ రాజధానిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వద్ద భద్రతా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కొన్నాళ్లు సేవలు అందించారు. అనంతరం రిటైర్ అయ్యాక.. ZPM పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అది ఇప్పుడు మిజోరాం రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా(Mizoram CM) మారింది.