UP దారుణం..‘నీట్’ విద్యార్థినిపై టీచర్ల లైంగిక దాడి

విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని, నువ్వు కూడా రావాలంటూ ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్ సాహిల్ సిద్దిఖీ (32) ఆమెను ఇంటికి ఆహ్వానించాడు

Published By: HashtagU Telugu Desk
Minor Neet Aspirant Held Ho

Minor Neet Aspirant Held Ho

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur) లో దారుణం జరిగింది. ‘నీట్’ విద్యార్థినిపై (NEET student) ఇద్దరు టీచర్లు గత కొద్దీ నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇప్పుడు తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వారి కామ కోరిక తీర్చుకోవడం కోసం అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు. పోలీసులు , ప్రభుత్వాలు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో భయం , కానీ మార్పు కానీ రావడం లేదు.

తాజాగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. నీట్ కోచింగ్ కోసం 2022లో ఓ విద్యార్థిని కాన్పూరు వచ్చి ఓ పాప్యులర్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యింది. విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని, నువ్వు కూడా రావాలంటూ ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్ సాహిల్ సిద్దిఖీ (32) ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ఆమె వెళ్లాక అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గుర్తించింది. సాహిల్ ఆమెతో మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీశాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని, తన కుటుంబాన్ని చంపేస్తానని సిద్దిఖీ తనను బెదిరించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను తన ఫ్లాట్‌లో కొన్ని రోజులపాటు నిర్బంధించాడు. అక్కడ 39 ఏళ్ల కెమిస్ట్రీ టీచర్ వికాశ్ పోర్వాల్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు మైనర్ అని పోలీసులు తెలిపారు. తాను హోలీ జరుపుకొనేందుకు ఇంటికి వెళ్లినప్పుడు సిద్దిఖీ ఫోన్ చేసి తనను వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాడని, రాకుంటే తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Read Also : Group 3 : తెలంగాణ గ్రూప్‌ – 3 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

  Last Updated: 10 Nov 2024, 12:16 PM IST