Spa Centre Crime: మైనర్ పై అంతులేని అత్యాచారాలు.. స్పా మాటున అరాచకాలు!!

14 ఏళ్ళ బాలికపై జరిగిన దారుణమిది. ఓ స్పా లో రిసెప్షనిస్టుగా చేరిన ఈ అమ్మాయి నరకాన్ని చూసింది.

  • Written By:
  • Updated On - September 18, 2022 / 11:56 PM IST

14 ఏళ్ళ బాలికపై జరిగిన దారుణమిది. ఓ స్పా లో రిసెప్షనిస్టుగా చేరిన ఈ అమ్మాయి నరకాన్ని చూసింది. ఒక్కో రోజు 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఎట్టకేలకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమానుషం వెలుగు చూసింది. ఈ వ్యవహారం హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఒక స్పా కేంద్రం వేదికగా జరిగింది.

ఆ బాలిక ఉద్యోగం కోసం ఓ స్పా లో రిసెప్షనిస్టుగా చేరింది. కానీ మొదటిరోజే.. ఆమెను ఓ రూమ్ లోకి పంపారు. అక్కడున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. దాంతో ఇక్కడ జాబ్ మానేస్తానని చెప్పగా.. నీ మీద జరిగిన లైంగిక దాడి వీడియోను సర్క్యులేట్ చేస్తామని స్పా నిర్వాహకులు బెదిరించారు.
దీంతో విధిలేక మరో నాలుగైదు రోజులు స్పా కు వెళ్ళింది. రోజూ తనమీద అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చారని ఆమె తెలిపింది. ఒక్కో రోజు 10 నుంచి 15 మంది వ్యక్తులు తనపై రేప్ చేశారని పోలీసులకు చెప్పింది.
ఆ తర్వాత కొన్ని రోజులు స్పా కు వెళ్లక పోవడంతో.. నన్ను ఆ మహిళ , మరికొందరు పిలిచి ఓ హోటల్ కు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారని పేర్కొంది. ఇంత జరిగినా తన తలిదండ్రులకు హాని తలపెడతారేమోనని భయపడి ఆమె పేరెంట్స్ కి ఏమీ చెప్పలేదట.. అయితే ఒకరోజున పేరెంట్స్ కి అనుమానం వచ్చి ఆరా తీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితురాలు తెలిపింది. ఖాకీల దర్యాప్తులో ఒక మహిళ.. మరికొందరు ఓ ముఠాగా ఏర్పడి బాలికలను ఉద్యోగాల పేరిట ప్రలోభపెట్టి వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని తేలింది. వీరిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ పెట్టి ఐపీసీ, పోక్సో చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారందరిపైన, సదరు మహిళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.