NDA Leaders Meeting : ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు వారు బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. దాంతో పాటు జమిలి, వక్ఫ్ బిల్లులు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేరింగ్‌పైనా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోని సీనియర్లందరూ ఈ సమావేశానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4.00 గంటలకు వీరు సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. అందుకోసం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలుతోపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై ఎన్డీయే నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.
అంతేకాక.. 2025లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల పంపకంపై బీజేపీ చర్చించే అవకాశం ఉంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) లేదా జెడి(యు), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తికి కాషాయ పార్టీ కొన్ని సీట్లు ఇవ్వవచ్చు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, మెరుగైన సమన్వయం కోసం ప్రతి నెలా సమావేశం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌డిఎ మిత్రపక్షాలను కోరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఈ సెషన్ వచ్చింది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో అపూర్వమైన కొన్ని పరిణామాలకు పార్లమెంట్ సాక్షిగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అదే విధంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా.. ఈ నేతలు సమావేశం అవుతున్నారు.
Read Also: Jammu and Kashmir : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి