Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’.. ఇది ఒక సాధారణ పేరు కాదు. ఇది ఒక సాధారణ లోగో కాదు. ఇది భారతదేశ ప్రజలలో ఉప్పొంగిన ఉద్వేగానికి ప్రతీక. పహల్గాంలో 26 మంది భారతీయులను మతం గురించి అడిగి మరీ పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత, భారతీయుల్లో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలకు నిదర్శనమే ఆపరేషన్ సిందూర్. ఈ పదంపై ట్రేడ్ మార్క్ కోసం, రైట్స్ కోసం పలు వినోద రంగ సంస్థలూ అప్లై చేసుకున్నాయి. ప్రతీ భారతీయుడి మదిని టచ్ చేసిన పదం ఆపరేషన్ సిందూర్. అందుకే దానికి అంతటి క్రేజ్ వచ్చింది. ఇంతకీ ఈ లోగోను(Operation Sindoor Logo) ఎవరు డిజైన్ చేశారు ? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Miss World Finals : మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో తలపడేది వీరే.. కౌంట్‌డౌన్ షురూ
ఆపరేషన్ సిందూర్ లోగో గురించి..
- జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. 26 మంది భారతీయ టూరిస్టులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు.
- ఇందుకు ప్రతిగా మే7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఈ సైనిక చర్యకు భారత సేనలు పెట్టిన పేరే ‘ఆపరేషన్ సిందూర్’.
- పాక్‌పై భారత్ దాడి చేసిందని తెలియగానే.. ఈ పదం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ కీవర్డ్‌కు గూగుల్, యూట్యూబ్‌లలో భారీగా సెర్చ్ రేట్ పెరిగింది.
- ఆపరేషన్ సిందూర్ లోగో కూడా క్షణాల్లో వరల్డ్ ఫేమస్ అయింది.
- ఈ లోగోను భారత సైన్యంలోని సిబ్బందే తయారు చేశారు.
- పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఎటాక్ చేసిన వెంటనే భారత ఆర్మీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఆపరేషన్ సిందూర్ లోగోతో కూడిన పోస్టర్లు పెట్టింది.
- భారత ఆర్మీ పత్రిక ‘బాత్‌చీత్’.. భారత సేనల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్‌కు అంకితమిస్తూ తాజాగా ఒక సంచికను రిలీజ్ చేసింది. ఈ సంచికలో ఆపరేషన్ సిందూర్ లోగో తయారీ వివరాలను ప్రకటించింది.
- ఆపరేషన్ సిందూర్ లోగోను లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్‌గుప్తా, హవల్దార్ సురీందర్‌సింగ్ తయారు చేశారని వెల్లడించింది.
- పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయి సిందూరానికి దూరమైన మహిళల గౌరవార్థం.. భారత్ చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ సిందూర్ అనే పేరును పెట్టారు. ఈ పేరుకు అనుగుణంగా లోగోలో సిందూరాన్ని వినియోగించారు. విషాదానికి గుర్తు నలుపు రంగు. అందుకే ఈ లోగో బ్యాక్ గ్రౌండ్‌లో నలుపు రంగును వాడారు. సిందూర్ అనే ఆంగ్ల పదంలో సంప్రదాయ సిందూరం గిన్నెలను ఉంచారు. ఆ గిన్నెల నుంచి కొంత సిందూరం చిందినట్లుగా, అది చెల్లాచెదురుగా పడినట్లుగా లోగోలో ఉంది. పహల్గాం ఉగ్రదాడి వల్ల కొందరు మహిళలు సిందూరానికి దూరమయ్యారనే స్పష్టమైన మెసేజ్ ఇచ్చేలా ఈ లోగో ఉంది.
Also Read :NTRs Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు