Site icon HashtagU Telugu

Kejriwal Daily Routine: జైలులో తొలి ఉదయం.. సీఎం కేజ్రీవాల్ ఏమేం చేశారంటే..

Arvind Kejriwal

Meditation, bread-tea for breakfast..Arvind Kejriwal’s first morning in Tihar

Arvind Kejriwal Daily Routine : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్(Arvind Kejriwal)​కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెండు వారాల పాటు తిహార్‌ జైలులోనే ఉండనున్నారు. నేటి సాయంత్రం (ఏప్రిల్ 1)ఆయన్ను భారీ భద్రత నడుమ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్​కు జైలులో రెండో నంబరు గదిని కేటాయించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

on WhatsApp. Click to Join.

మిగతా ఖైదీలకు లాగే కేజ్రీవాల్‌ డైలీ రొటీన్‌ ఉదయం 6.30 గంటలకు మొదలవ్వనుంది. టిఫిన్​లో భాగంగా చాయ్‌, కొన్ని బ్రెడ్‌ స్లైస్​లు ఇవ్వనున్నారు. ఆ తర్వాత కాలకృత్యాలు ముగించుకుని ఆయన్ను కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే తన న్యాయబృందంతో సీఎం సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది.

ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య కేజ్రీవాల్​కు లంచ్​ ఇవ్వనున్నారు. అన్నం, కూర, పప్పు వీటితో పాటు ఐదు రొట్టెలును కూడా ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం తన గదిలోనే ఉండాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చాయ్‌, రెండు బిస్కట్లను ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లను కేజ్రీవాల్ కలిసే అయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకే రాత్రి పూట భోజనాన్ని ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకల్లా మళ్లీ ఆయన్ను సెల్​లోకి పంపిస్తారు.

Read Also: Tollwood Stars: సమ్మర్ ఎఫెక్ట్.. విదేశాల్లో చిల్ అవుతున్న మహేశ్, రామ్ చరణ్

సీఎంకు టీవీ చూసే సదుపాయాన్ని కల్పించారు జైలు సిబ్బంది. సుమారు 18 నుంచి 20 ఛానళ్ల వరకు ఆయన చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్య సిబ్బంది కూడా ఆయన కోసం అందుబాటులో ఉంటారు. డయాబెటీస్‌తో కేజ్రీవాల్​ బాధపడుతున్నందున ఆయనకు రెగ్యులర్‌ చెకప్‌లు చేయనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్‌ ఇవ్వాలంటూ ఆయన లాయర్లు ఇటీవలే అభ్యర్థించారు. ఇక, కేజ్రీవాల్‌ వారానికి రెండుసార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడొచ్చే అవకాశం కల్పించారు.

మరోవైపు జైల్​లో తనకు రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్‌మినిస్టర్స్‌ డిసైడ్‌, ఇలా మూడు పుస్తకాలను అనుమతించాలంటూ కేజ్రీవాల్‌ తాజాగా కోర్టును అభ్యర్థించారు. టేబుల్‌, కుర్చీ, మెడిసిన్స్‌ కూడా అనుమతించాలంటూ ఆయ కోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.

Read Also: Vistara : విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు

కాగా, జైల్లో తొలిరోజు రాత్రి కేజ్రీవాల్‌ హాయిగా నిద్రపోయినట్లు జైలు వర్గాలు తెలిపాయి. అనంతరం ఇవాళ ఆయన యోగా, బ్రెడ్‌-టీతో తన రోజును ప్రారంభించినట్లు చెప్పారు. ఉదయం లేవగానే 6.30 గంటలకు కేజ్రీవాల్‌కు బ్రేక్‌ఫాస్ట్‌ కింద బ్రెడ్‌, టీ అందించినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అల్పాహారం చేసి మందులు వేసుకున్నట్లు తెలిపాయి. అదేవిధంగా కేజ్రీవాల్‌ తన సెల్‌లో గంటకుపైగా ధ్యానం (Meditation) చేసుకున్నారని, ఆ తర్వాత యోగా కూడా చేసినట్లు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం ఇవ్వనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.