Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక

ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెక్స్ 2024 (Medical Bills) ప్రకారం..  ద్రవ్యోల్బణం కారణంగా మన దేశంలో ప్రజల వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ ఖర్చులు ఏటా 14శాతం మేర పెరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Medical Bills India New Healthcare costs

Medical Bills :  భారత్ లాంటి డెవలప్ అవుతున్న దేశంలో  పేదలకు తప్పకుండా అవసరమైనవి నాణ్యమైన వైద్యం, మంచి ప్రమాణాలతో కూడిన విద్య.  ఇవి రెండూ నేటికీ చాలా వర్గాలకు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు కొన్ని రకాల వైద్యాలు చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా పేదల జేబుకు చిల్లుపడుతోంది. వారికి వచ్చే అరకొర ఆదాయం ఆస్పత్రుల పాలవుతోంది. కొందరైతే అప్పులు చేసి మరీ వైద్య చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది. వెరసి మన దేశంలో ప్రజల వైద్యఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈవివరాలను ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెక్స్ 2024 రిపోర్టులో వెల్లడించారు.

Also Read :Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

నివేదికలోని కీలక వివరాలివీ.. 

  • ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెక్స్ 2024 (Medical Bills) ప్రకారం..  ద్రవ్యోల్బణం కారణంగా మన దేశంలో ప్రజల వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ ఖర్చులు ఏటా 14శాతం మేర పెరుగుతున్నాయి.
  • మన దేశంలో చాలామంది ఆస్పత్రి ఖర్చుల్లో 23 శాతం మొత్తాన్ని భర్తీ  చేసుకునేందుకు అప్పులు చేస్తున్నారు. ఇలా అప్పులు చేస్తున్న కుటుంబాలపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది.
  • దేశ ప్రజలు వైద్య ఖర్చుల కోసం తమ పొదుపు డబ్బుల నుంచి దాదాపు 62 శాతం మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు.  అనుకోకుండా చుట్టుముట్టే ఆరోగ్య సమస్యల వల్ల మన దేశంలోని పేద కుటుంబాలు కోలుకోలేని విధంగా  కుదేలవుతున్నాయి.
  •  మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్  చేయించుకున్న వారిలో అత్యధికులు కిడ్నీ జబ్బులకు సంబంధించిన క్లెయిమ్స్ చేసుకుంటున్నారు.
  • మన దేశంలో కిడ్నీ జబ్బులతో క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిలో అత్యధికులు ఢిల్లీవాసులు కాగా, తర్వాతి స్థానాల్లో కొచ్చి, సికింద్రాబాద్‌, బెంగళూరు, జైపూర్ నగరాలు ఉన్నారు.
  • మన దేశంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి సగటు వయసు 47 ఏళ్లు.  కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం కొందరు బాధితులు ఏకంగా రూ.24 లక్షల దాకా వైద్య బిల్లులు కట్టాల్సి వస్తోంది.
  • కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో 31 నుంచి 35 ఏళ్లలోపు వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సర్వేలో గుర్తించారు.
  • 2025 నాటికి మన దేశంలో క్యాన్సర్‌ కేసులు 13శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read :Hate Rich People : డబ్బున్న వాళ్లంటే మనదేశంలో ద్వేషమెందుకో చెప్పిన జెరోధా సీఈఓ

  Last Updated: 28 Sep 2024, 04:18 PM IST