Maharashtra : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాబితాల్లోకి వచ్చాయని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఆ 39 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.
Read Also: Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఈ 39 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరు? అంటూ నిలదీశారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అని రాహుల్ గాంధీ అన్నారు. కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు. అంతేకాక..మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని నేను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఐదేళ్ల కాలంలో పెరిగిన ఓటర్లకు సమానంగా కేవలం గత ఐదు నెలల్లోనే పెరిగారని, ఇది ఎలా జరిగిందో ఎన్నికల సంఘం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. దాంతో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాను మించిపోయిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాను ప్రతిపక్ష పార్టీలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాయని, ఈ అధ్యయనం ద్వారా ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు జరిగినట్లు తేలిందని చెప్పారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ప్రశ్నిస్తున్నాయని, ఎన్నికల సంఘం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్