Godan Express : ముంబై – గోర‌ఖ్‌పూర్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంట‌లు

  Godan Express : ముంబై – గోర‌ఖ్‌పూర్(Mumbai – Gorakhpur) గోదాన్ ఎక్స్‌ప్రెస్(Godan Express) రైల్లో ఆక‌స్మాత్తుగా మంట‌లు(Fires) చెల‌రేగాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న నాసిక్ రోడ్ రైల్వే స్టేష‌న్(Nashik Road Railway Station) స‌మీపంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంభ‌వించింది. సీటింగ్ క‌మ్ ల‌గేజీ రేక్ కోచ్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో రెండు బోగీలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేసింది. ప్ర‌యాణికుల‌ను ఇత‌ర […]

Published By: HashtagU Telugu Desk
Massive fire erupts in two bogies of Godan Express at Nasik Road railway station

Massive fire erupts in two bogies of Godan Express at Nasik Road railway station

 

Godan Express : ముంబై – గోర‌ఖ్‌పూర్(Mumbai – Gorakhpur) గోదాన్ ఎక్స్‌ప్రెస్(Godan Express) రైల్లో ఆక‌స్మాత్తుగా మంట‌లు(Fires) చెల‌రేగాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న నాసిక్ రోడ్ రైల్వే స్టేష‌న్(Nashik Road Railway Station) స‌మీపంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంభ‌వించింది. సీటింగ్ క‌మ్ ల‌గేజీ రేక్ కోచ్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో రెండు బోగీలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేసింది. ప్ర‌యాణికుల‌ను ఇత‌ర రైళ్ల‌ల్లో త‌ర‌లించారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే నాసిక్ రోడ్డు స్టేష‌న్ నుంచి రైలు బ‌య‌ల్దేరిన కాసేప‌టికే కోచ్‌లో పొగ‌లు ఏర్ప‌డ్డాయి. ఆ త‌ర్వాత క్ష‌ణాల్లోనే మంట‌లు చెల‌రేగాయ‌ని ప్ర‌యాణికులు తెలిపారు. రైలును వెంట‌నే నిలిపివేశారు. తీవ్ర ఆందోళ‌న‌కు గురైన ప్ర‌యాణికులు క్ష‌ణాల్లోనే రైలును దిగేశారు. స‌మీపంలోనే హైటెన్ష‌న్ విద్యుత్ వైర్లు ఉండ‌టంతో వాటికి మంట‌లు వ్యాపించ‌కుండా అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది చ‌ర్య‌లు తీసుకున్నారు.

read also: Summer: సమ్మర్ లో ఆ జాగ్రత్తలు మస్ట్.. అవేంటో తెలుసా

 

  Last Updated: 22 Mar 2024, 07:50 PM IST