Online Ganja: ‘రూటు’ మారుస్తున్నగంజాయి మాఫియా…’ఆన్ లైన్’ అడ్డాగా న‌యా దందా

దేశ వ్యాప్తంగా గంజాయి అక్ర‌మ ర‌వాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 16, 2021 / 06:06 PM IST

దేశ వ్యాప్తంగా గంజాయి అక్ర‌మ ర‌వాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే పోలీసుల క‌ళ్లు గ‌ప్పి గంజాయి మాఫియా కొత్త‌దారుల‌ను వెతుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ర‌కాలుగా గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేసిన కేటుగాళ్లు ఈ సారి ఏకంగా ఈ కామ‌ర్స్ ని అడ్డాగా చేసుకున్నారు. ప్రముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ లో క‌డిప‌ట్ట ముసుగులో కొంద‌రు విక్ర‌య‌దారులు గంజాయిని విక్ర‌యిస్తున్నార‌ని కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ‌ర్స్‌(సీఏఐటీ) ఆరోపించింది. దీనిపై ఎన్సీబీ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేసింది.

మధ్యప్రదేశ్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించిన నివేదికలపై ఎన్‌సిబి విచారణకు డిమాండ్ చేస్తూ ట్రేడర్స్ బాడీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆదివారం మధ్యప్రదేశ్ పోలీసులు భింద్ జిల్లాలో రోడ్డు పక్కన ఉన్న ఓ షాపు వద్ద 20 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని విచాకించగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి గంజాయిని స్మగ్లింగ్ చేయడానికి అమెజాన్‌ను ఉపయోగించినట్లు వీరిద్దరూ పోలీసులకు చెప్పినట్లు స‌మాచారం. అమెజాన్ బ్రాండింగ్‌తో కూడిన ప్యాకేజీలలో 1,000 కిలోల కంటే ఎక్కువ నిషేధించబడిన డ్రగ్‌లను తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను ఛేదించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు.

Also Read: చంద్రుడిపై 800కోట్ల మందికి ల‌క్ష ఏళ్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌.. కానీ..

గత నాలుగు నెలల్లో ఒకే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దాదాపు ఒక టన్ను (1,000 కిలోలు) గంజాయిని వారు ఇప్పటికే విక్రయించార‌ని… గత నాలుగు నెలల్లో రూ. 1.10 కోట్ల విలువైన ద్రవ్య లావాదేవీలు జరిగాయని భిండ్ డిఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. దీనిని నివారించాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ల‌ను సిఎఐటి కోరింది.

Also Read: లైగర్ వర్సెస్ లెజెండ్.. బాక్సింగ్ రింగ్ లో కింగ్ ఎవరో!

కోటి రూపాయ‌ల కంటే ఎక్కువ విలువైన గంజా.యిని అమెజాన్ ద్వారా విక్ర‌యించారని దీనికి అమెజాన్ కు ఆర‌వై ఆరుశాతం క‌మిష‌న్ పొందుతుంద‌ని సీఏఐటీ జాతీయ అధ్య‌క్షుడు బీసీ భాటియా, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌వీన్ ఖండేల్వాల్ ఆరోపించారు. అమెజాన్ NDPS (నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టంలోని సెక్షన్ 20(బి)ని ఉల్లంఘించిందని…దీని ప్రకారం ‘ఉత్పత్తి చేయడం, తయారు చేయడం, కలిగి ఉండటం, విక్రయించడం, కొనుగోళ్లు, రవాణా చేయడం, అంతర్రాష్ట్ర దిగుమతులు, అంతర్రాష్ట్ర ఎగుమతులు లేదా గంజాయిని ఉపయోగించడం వంటివి శిక్షార్హమైనవని వారు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అమెజాన్ స్థానిక ఎగ్జిక్యూటివ్‌లను పిలిచి విచార‌ణ చేప‌డుతున్నారు.