March To May : ఎండలపై ఐక్యరాజ్యసమితి వార్నింగ్.. ఏం చెప్పిందో తెలుసా ?

March To May : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలకమైన హెచ్చరిక చేసింది.

  • Written By:
  • Updated On - March 5, 2024 / 02:55 PM IST

March To May : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలకమైన హెచ్చరిక చేసింది. ఈనెల (మార్చి) నుంచి మే వరకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. డిసెంబరులో గరిష్ట స్థాయికి  చేరుకున్న ‘ఎల్ నినో’..  ఇప్పటివరకు నమోదైన ఐదు బలమైన ‘ఎల్ నినో’లలో ఒకటని ఐక్యరాజ్యసమితి గుర్తు చేసింది. ‘ఎల్ నినో’(March To May)   ఎఫెక్ట్ కారణంగా మే నెల వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఎల్ నినో క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలో చిక్కుకున్న వేడిని పెంచుతున్నాయని పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరువుకు, ఇతర చోట్ల భారీ వర్షాలకు దారితీస్తుంది. ఎల్ నినో అనేది సగటున ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. సాధారణంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ప్రభావాన్ని కంటిన్యూగా చూపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ నెల నుంచి మే వరకు ఎల్‌నినో కొనసాగే అవకాశం 60 శాతం కాగా.. ఏప్రిల్‌ నుంచి జూన్‌లో 80 శాతం తటస్థ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనావేసింది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల వల్ల వాతావరణానికి ఎల్‌నినో రిస్క్ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. 2023 నుంచి ప్రతి నెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. 2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకు కూడా ఎక్కిన సంగతి మనకు తెలిసిందే.  ఎల్ నినో ఎఫెక్టు వల్లే 2023 ఆ రేంజులో మండిపోయింది. ప్రపంచంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత 10 నెలలుగా స్థిరంగా, అసాధారణ రేంజులో  ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు చెప్పారు. ప్రత్యేకించి 2024 సంవత్సరం జనవరిలోనూ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది.

Also Read : Tata Motors Split : రెండు కంపెనీలుగా టాటా మోటార్స్.. ఎందుకు ?

ఎండల దడ.. ఏపీ అలర్ట్.. 

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది.  వడగాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ.. అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.