Site icon HashtagU Telugu

MK Stalin : స్టాలిన్‌ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం

Many Kannada people are angry over Stalin post

Many Kannada people are angry over Stalin post

MK Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీంతో స్టాలిన్‌ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీలిమిటేషన్‌, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ, మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: MAD Square : యూఎస్ లో దుమ్ములేపుతున్న మ్యాడ్ స్క్వేర్ వసూళ్లు

కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్‌ వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండటం అత్యవసరం. మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి అని స్టాలిన్‌ నిన్న పోస్ట్‌ పెట్టారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగు, కన్నడలో రాశారు. మరోవైపు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌ కూడా దీనిపై స్పందిస్తూ.. స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్‌ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.

Read Also: Trump : మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్‌ : ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు