Manmohan Daughters : దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్‌లో ఉన్నారా ? త్వరలో వారి ఫ్యామిలీ నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా ? అనే దానిపై ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. ఈ అంశంతో ముడిపడిన ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read :Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సాదాసీదాగా జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ తన కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తీసుకురాలేదు. చాలా ప్రైవసీతో జీవితాన్ని గడిపారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రధానమంత్రిగా భారత్‌లాంటి అతిపెద్ద దేశాన్ని పదేళ్లు పాలించినా.. ఆయన ఆస్తులేం పెరగలేదు. జీవనశైలి మారలేదు. కుటుంబ సభ్యులెవరూ అకస్మాత్తుగా పెద్దపెద్ద వ్యాపారాలనూ ప్రారంభించలేదు. నీతినిజాయితీగా మారుపేరుగా మన్మోహన్ నిలిచారు. మన్మోహన్(Manmohan Daughters) భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ఆయన స్ఫూర్తివంతమైన జీవితం ఇంకా సజీవంగానే ఉంది. మన్మోహన్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు.. ఉపిందర్ సింగ్, తమన్ సింగ్, అమృత్ సింగ్.
ఉపిందర్ సింగ్
మన్మోహన్ సింగ్ పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ అశోకా యూనివర్సిటీ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె చరిత్రకారిణి. భారతీయ చరిత్రపై పలు పుస్తకాలు రాశారు. ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంలో నిపుణుడైన విజయ్ తంఖాను ఉపిందర్ పెళ్లి చేసుకున్నారు.
తమన్ సింగ్
మన్మోహన్ సింగ్ కుమార్తె తమన్ సింగ్ రచయిత. స్ట్రిక్ట్లీ పర్సనల్ అనే టైటిల్‌తో తన తల్లిదండ్రుల జీవిత చరిత్ర సహా ఎన్నో బుక్స్‌ను ఆమె రాశారు. మిజోరంలో అటవీ సంరక్షణ వంటి సామాజిక సమస్యలపై తమన్ సింగ్ బుక్స్‌ను రాసి రిలీజ్ చేశారు. డామన్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, నేషనల్ ఇంటెలీజెన్స్ గ్రిడ్ మాజీ సీఈవో అశోక్ పట్నాయక్‌ను తమన్ పెళ్లి చేసుకున్నారు.
అమృత్ సింగ్
మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ అమెరికాలో లాయర్‌గా పనిచేస్తున్నారు. ఆమె అక్కడ మానవ హక్కుల లాయర్‌గా సేవలు అందిస్తున్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో లా బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనీషియేటివ్‌తో కలిసి పనిచేస్తున్నారు. యేల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి టాప్ క్లాస్ యూనివర్సిటీల్లో అమృత్ చదువుకున్నారు.
Also Read :Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 179 మంది మృతి
ఇక అసలు విషయానికొస్తే.. మన్మోహన్ సింగ్ ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నత విద్యావంతులు. వారు ఎన్నడూ రాజకీయాలపై కనీసం కామెంట్స్ కూడా చేయలేదు. ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. విద్యారంగంపైనే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంది. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వారిలో ఎవరికైనా ఏదైనా కీలక అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా ఛాన్స్ కల్పిస్తే.. దాన్ని వారు స్వీకరిస్తారా ? లేదా ? అనేది వేచిచూడాలి.