Manipur violence : మణిపూర్‌ హింస..మరో 20 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనిట్లన్ని ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Manipur violence..20 more companies of CAPF forces

Manipur violence..20 more companies of CAPF forces

CAPF forces : రాష్ట్రంలో తాజా దాడులు, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో మణిపూర్‌కు దాదాపు 2,000 మంది సిబ్బందితో కూడిన 20 అదనపు కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్)ని కేంద్ర ప్రభుత్వం పంపింది. 2000 మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రాష్ట్రానికి తరలించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనిట్లన్ని ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక తక్షణమే విమానం ద్వారా వీరందరిని రాష్ట్రాలనికి పంపించాలని తెలిపింది. 20 సీఏపీఎఫ్ కంపెనీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) 15, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు చెందిన 5 బలగాలు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, జిరిబామ్ జిల్లాలోని జైరాన్ గ్రామంలో 31 ఏళ్ల హ్మార్ మహిళ (కుకిస్‌తో జాతికి సంబంధించినది) అత్యాచారం చేసి కాల్చివేయబడింది. మెయిటీ కమ్యూనిటీకి చెందిన మరో మహిళా రైతును ఎదురుదాడి లేదా ప్రతీకార దాడిగా కాల్చి చంపారు. ‘జిరిబామ్ సంఘటనకు. ఇద్దరు మహిళల హత్య గత ఏడాది మేలో ప్రారంభమైన మెయిటీ-కుకీ వివాదంలో మహిళలను లక్ష్యంగా మరియు ప్రతి-లక్ష్యాలుగా ఎలా ఉపయోగించుకుంటున్నారో వెలుగులోకి తెచ్చింది.

ఇక కాగా, గతేడాది మేలో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత రాష్ట్రంలో 198 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు మోహరించింది. దీంతో తాజా బలగాలు వాటితో జతకట్టనున్నాయి. పలువురు వ్యక్తులు అదృశ్యం కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్‌లో 11 మంది కుకీ మిలిటెంట్ల ను భద్రతా బలగాలు హతమార్చాయి. అనంతరం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: AP Assembly : అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం

 

  Last Updated: 13 Nov 2024, 04:06 PM IST