వందే భారత్ రైలు(Vande Bharat Train)లో చోటుచేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ (Rajeev Singh) తన కుటుంబంతో కలిసి ఢిల్లీ–భోపాల్ వందే భారత్ రైల్లో ప్రయాణిస్తుండగా, సీటు మార్పు విషయంలో ఓ ప్రయాణికుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఎంపీకి రైల్వే విభాగం కంపార్ట్‌మెంట్ చివరన సీటు కేటాయించగా, ఆయన భార్య, కొడుక్కు ముందుభాగంలో సీట్లు వచ్చాయి. అందువల్ల భార్య, కుమారుడి పక్కన కూర్చోవాలని భావించిన ఎమ్మెల్యే, అక్కడ కూర్చున్న ప్రయాణికుడిని సీటు మారమని అడిగాడు.
Life Style : సంపాదించిన డబ్బులన్నీ ఖర్చైపోతున్నాయా? పొదుపు ఎలా చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అయితే సీటు మారేందుకు ఆ ప్రయాణికుడు అంగీకరించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన అనుచరులకు సమాచారం అందించాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే, ఎమ్మెల్యే అనుచరులు కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి గందరగోళం సృష్టించారు. మాటకు మాట పెరిగి, చివరికి కొట్లాట వరకు వెళ్ళింది. బాధితుడిపై కర్రలు, చెప్పులతో దాడి చేసారు. ఈ దాడిలో సదరు వ్యక్తి ముక్కుకు తీవ్ర గాయమై, రక్తస్రావం జరిగింది. రక్తంతో అతడి చొక్కా తడిసిపోయింది. ఈ ఘటనపై తోటి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
Israel- Iran: ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన యుద్ధం!
ఘటన తర్వాత ఆశ్చర్యకరంగా ఎమ్మెల్యేనే బాధితుడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, అసలు గొడవ సీటు మార్పు విషయంలో జరిగినదని ప్రాథమికంగా తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రజల నుంచి ఎమ్మెల్యే ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.