Man Vs Dogs : ఆ కామాంధుడు పేట్రేగిపోయాడు. ఏకంగా పదుల సంఖ్యలో వీధి కుక్కలపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా జిల్లాలో ఉన్న కైలాశ్ నగర్ ఏరియాలో చోటుచేసుకుంది. కుక్కలపై అఘాయిత్యానికి పాల్పడిన సదరు వ్యక్తి పేరు నౌషాద్. ఒక స్వచ్ఛంద సంస్థ కోసం నౌషాద్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. మూగజీవాల సంక్షేమం కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నౌషాద్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నౌషాద్ ఇప్పటివరకు దాదాపు 12 నుంచి 13 ఆడ కుక్కలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read :Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న వీధి కుక్కలు
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు(Man Vs Dogs) దడ పుట్టిస్తున్నాయి. పలు కాలనీల పరిధిలో కొందరు స్థానికులను కుక్కలు కరిచాయి. గత వారం రోజుల వ్యవధిలో కుక్క కాటుతో సిటీలోని ఫీవర్ ఆస్పత్రిలో దాదాపు 600 మంది చేరారు. 2024 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో హైదరాబాద్ పరిధిలో కుక్క కాటుతో ఫీవర్ ఆస్పత్రిలో దాదాపు 2,700 మంది చేరారు. ఎండాకాలంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కుక్కలు చిరాకుగా ఫీల్ అవుతాయి.ఈ క్రమంలోనే కోపంతో మనుషులపై దాడి చేస్తుంటాయి. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు రెండు కూడా కరిచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వాటికి వ్యాక్సినేషన్‌తో పాటు ఎప్పటికప్పుడు ఆహారం, నీళ్లు ఇవ్వాలి. వీధి కుక్కలకు సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక.. వాటిలో కొన్ని మనుషులను కరుస్తుంటాయి. ప్రధానంగా పిల్లలు, మహిళలను కుక్కలు కరుస్తాయి. మొత్తం మీద కుక్కలు కరిచే కేసులు ఏటా ఎన్నో కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తుంటాయి.