Site icon HashtagU Telugu

karnataka: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడు.. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

Encounter

Encounter

karnataka: ఐదేళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసి ఆపై హ‌త్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారు. 35ఏళ్ల నిందితుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో అత‌ను పారిపోతుండ‌గా పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు. అయితే, కిడ్నాప్ అనంత‌రం బాలిపై నిందితుడు అత్యాచారంకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే, పోలీసులు ఇంకా ఆ విష‌యాన్ని నిర్ధారించ‌లేదు.

Also Read: Kumar Mangalam Birla : కుమార్‌ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్‌

కర్ణాటకలోని హుబ్లిలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడిని ఆదివారం పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని బీహార్‌లోని పాట్నా నివాసి అయిన 35 ఏళ్ల రితేష్ కుమార్‌గా గుర్తించారు. అత‌ను బాలికపై అత్యాచారం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.

 

ఆదివారం ఉద‌యం పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ వెలుపల వందలాది మంది గుమిగూడి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. నిందితుడికోసం సీసీటీవీ ఫుటేజ్‌లను ప‌రిశీలించారు. స్థానికుల నుండి సమాచారం సేకరించారు. దీని ఆధారంగా, పోలీసులు నిందితుడిని కనిపెట్టారు. అయితే అత‌న్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా.. నిందితుడు పారిపోతుండ‌టంతో కాల్పులు జ‌రిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.

 

హుబ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశి కుమార్ వివ‌రాల‌ ప్రకారం.. ఈరోజు ఉదయం విజయనగర్ ప్రాంతంలోని అశోక్ నగర్ పరిధిలోని ఒక పాడుబడిన షెడ్‌లో బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితుడిని రితేష్ కుమార్‌గా గుర్తించాము. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశాడు, మా అధికారులపై దాడి చేశాడు. రాళ్లు రువ్వాడని కమిషనర్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి అదే ప్రాంతంలోని సమీప ఇళ్లలో పని చేస్తున్నప్పుడు ఆమెను తనతో పాటు తీసుకెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలిక‌ను ఇంటి నుంచి కిడ్నాప్ చేశాడు. చాలాసేపు వెతికిన తర్వాత .. పాడుప‌డిన‌ షెడ్‌లోని బాత్రూంలో బాలిక‌ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు, అక్కడ బాలిక‌ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించార‌ని తెలిపారు. బాలికపై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు వార్తలు వచ్చాయి, కానీ పోలీసులు దానిని ధృవీకరించలేదు.

Also Read: ICC: అఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం!