Site icon HashtagU Telugu

28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్‌కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?

Maldives 28 Islands To India

28 Islands – India : మాల్దీవులు దారికొచ్చింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్‌కు చేరువయ్యేందుకు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల్లోని 28 దీవులను భారత్‌కు అప్పగించింది. ఆయా దీవుల్లో నీరు, పారిశుధ్య ప్రాజెక్టులను మెరుగుపర్చే బాధ్యతను భారత్‌‌కు కేటాయించింది.  ఆయా దీవుల్లో భారత కార్యకలాపాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అవుతుందని భావిస్తున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. భారతదేశ గ్రాంట్ అసిస్టెన్స్ కింద హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ఆ 28 దీవుల్లో(28 Islands – India) అమలు చేస్తామని వెల్లడించారు. ఈ స్కీంల అమలు ద్వారా మాల్దీవుల సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం అవుతోందన్నారు. రెండు దేశాల సన్నిహిత సంబంధాలకు దీనికి సంబంధించిన ఒప్పందమే నిదర్శనమని  ముయిజ్జు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

మాల్దీవులలో భారత్ ఆరు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను కూడా తాజాగా ప్రారంభించింది.మాల్దీవులలో  మానసిక ఆరోగ్యం, ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, స్ట్రీట్ లైటింగ్ వంటి రంగాల వికాసానికి  కూడా భారత్ చేయూతను అందించనుంది. దీంతోపాటు ఏటా అదనంగా ఎంతోమంది మాల్దీవుల సివిల్ సర్వెంట్లకు భారత్‌లో ట్రైనింగ్ లభించనుంది. మాల్దీవులలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ప్రవేశానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఓకే అయ్యాయి.

Also Read :Adani Rebound : అదానీ గ్రూప్ స్టాక్స్ రీబౌండ్.. మళ్లీ లాభాల పంట

ఏటా భారత దేశ బడ్జెట్ నుంచి మాల్దీవులకు కూడా కేటాయింపులు చేస్తుంటారు. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవుల డెవలప్‌మెంట్ వర్క్స్‌కు రూ.770 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి బడ్జెట్‌లో రూ.400 కోట్లనే కేటాయించారు. భారత్‌తో మాల్దీవులు తన సంబంధాలను దెబ్బతీసుకోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత్ కేటాయింపులను తగ్గించడంతో మాల్దీవులకు చెమటలు పట్టాయి. దీంతో అది ఆర్థిక ప్యాకేజీలతో, డెవలప్‌మెంటు స్కీంలతో ఆదుకోవాలని భారత్‌ను కోరింది. దీంతో మాల్దీవులకు చెందిన 28 దీవుల్లో నీరు, పారిశుధ్య ప్రాజెక్టులను చేపట్టేందుకు భారత్ అంగీకరించింది.  దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల్లో మూడు రోజులు పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జుతో పాటు అందరూ మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఏదిఏమైనప్పటికీ ఈ పరిణామం చైనాకు పెద్ద షాకే.

Also Read :Telangana Cabinet : త్వరలోనే నాలుగు మంత్రి పదవుల భర్తీ.. పలువురికి నామినేటెడ్ పోస్టులు