మహారాష్ట్ర ప్రజలు మరోసారి మహాయుతి కూటమికి బ్రహ్మరధం పట్టారు. మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగగా.. మొత్తం 4,136 మంది బరిలోకి దిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, అజిత్ పవార్-ఎన్సీపీ, ఏకనాధ్ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివ సేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. అయితే రాష్ట్ర ఓటర్లు (Maharashtra Election Results) మాత్రం మహాయుతి కి పట్టం కట్టారు. మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది.
ఈ విజయం తో బిజెపి (BJP) శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అధిష్టానానికి మాత్రం ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఎవర్ని సీఎం (Maharashtra Next CM) గా ప్రకటించాలి..? ఎవరైతే నిలబెడితే బాగుంటుంది..? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు..? పార్టీ శ్రేణులు ఎలా తీసుకుంటారు అనేది అధిష్టానానికి సవాల్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో బిజేపీకి మహారాష్ట్రలో తక్కువ సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యత తీసుకోని కేవలం ఇదే నెలల్లో బిజెపి రూపురేఖలే మార్చేసి..ఈరోజు భారీ విజయం సాధించే దిశగా కష్టపడ్డారు.దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మహాయుతి కూటమిలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఆయనకు పోటీగా మహాయుతి కూటమిలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండ్ (Eknath Shinde) ఉన్నారు.
దీంతో ఎన్నికల్లో విజయం సాధించినా మహాయుతి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది. ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది. బిజేపీకి అత్యధిక సీట్లు రావడంతో ఫడ్నవీస్‌కే పట్టం కట్టబోతుంది అధిష్టానం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికలకు గ్రౌండ్ లెవెల్ లో బాగా ప్రచారం చేశారు. రెబెల్ అభ్యర్థులను శాంతింపచేసి, వారిని తిరిగి పార్టీ వైపునకు తీసుకువచ్చారు. సీట్ల సర్దుబాటులో కూడా బిజేపీకి మంచి డీల్ కుదిర్చారు. రెండు నెలలపాటు ఊపిరి తీసుకోకుండా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా.. బిజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం కట్టబెట్టారు సో ఆయనకు సీఎం పదవి ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరని..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మీడియా అడుగగా.. ఆయన మాట్లాడుతూ… “సీఎం అంశంలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఎన్నికల తర్వాత మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించుకోవాలని మొదటే నిర్ణయించాం. మేము తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి వివాదం ఉండదు” అని అన్నారు. మరి అధిష్టానం ఎవరికీ కట్టబెడుతుందో చూడాలి.
Read Also : Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్