Faecal Bacteria: మహాకుంభ మేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పటికే 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 నాటికి మరింత మంది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఈ తరుణంలో ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా (Faecal Coliform Bacteria) అధిక స్థాయిలో పెరుగుతోందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తెలిపింది. ఫేకల్ కొలిఫామ్ అనేది మానవ మల సంబంధమైన బ్యాక్టీరియా. దీనిపై తీసుకుంటున్న చర్యలు ఏమిటో వివరణ ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను ఎన్‌జీటీ ఆదేశించింది. ఎన్‌జీటీ నివేదికను కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ట్రిబ్యునల్ పరిశీలించింది. బుధవారం రోజు (ఫిబ్రవరి 19న) వర్చువల్‌గా తమ ఎదుట హాజరు కావాలని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను ఎన్‌జీటీ ఆదేశించింది.
Also Read :Maoist Committee: తెలంగాణ మావోయిస్టు కమిటీపై గురి.. వాట్స్ నెక్ట్స్
ఎన్‌జీటీ నివేదికలో ఏముంది ?
- ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదీ జలాలు స్నానం చేయడానికి అనువుగా లేవు.
- బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ప్రమాణాలకు అనుగుణంగా గంగానదీ జలాలు లేవు.
- గంగానదీ జలాల్లో మల బ్యాక్టీరియా పెరుగుతోంది.
- మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, పూజా కార్యక్రమాల వల్ల గంగానది కలుషితం అవుతోంది.
- గంగానదిలో శాస్త్రి బ్రిడ్జి ఎదుట 100 మిల్లీ లీటర్ల నీటిలో 11,000 కోలీఫామ్ బ్యాక్టీరియాలు, సంగం వద్ద 7900 కోలీఫామ్ బ్యాక్టీరియాలు కనిపించాయి.
- సంగం ప్రదేశానికి 2 కిమీ ముందుగా గంగా నదిపై శాస్త్రి బ్రిడ్జి ఉంది.
- సంగం వద్ద గంగానదితో కలిసే ముందు యమునా నదిలో పాత నైని బ్రిడ్జి వద్ద 100 మిల్లీ లీటర్ల నీటిలో 4900 కోలీఫామ్ బ్యాక్టీరియాలు బయటపడ్డాయి.
Also Read :MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ
- ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాల్లో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను(Faecal Bacteria) గుర్తించారు.
- బిహార్‌లోని సారన్‌లో ఒకటి, భోజ్‌పూర్‌లో తీసుకున్న మూడు నమూనాల్లోనూ ప్రమాదకరమైన స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను గుర్తించారు.
- స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియా అనేది మనిషి పేగుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం.
- ఈ బ్యాక్టీరియా కడుపు, పేగులకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు కారణమవుతుంది.