Maha Kumbh Stampede : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతున్నారు. కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను యూపీలోని సీఎం యోగి ఆదిత్యనాథ్(Maha Kumbh Stampede) సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోడీ సైతం తొక్కిసలాట ఘటనపై స్పందించడాన్ని పరిగణనలోకి తీసుకుంది. మహాకుంభ మేళా ముగిసేలోగా మరోసారి ఈ తరహా ఘటన జరగకుండా కీలకమైన నిర్ణయాలను వెలువరించింది. బుధవారం అర్ధరాత్రి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం..
Also Read :Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
కీలక నిర్ణయాలు ఇవే..
- మహా కుంభమేళాకు సంబంధించిన వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను యూపీ సర్కారు రద్దు చేసింది.
- మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించింది. అక్కడికి వాహనాల ప్రవేశాన్ని బ్యాన్ చేసింది.
- ప్రయాగ్‌రాజ్ పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేయనున్నారు.
- ఫిబ్రవరి 4 వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలను అనుమతించరు.
- కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ నియమాలను అమల్లోకి తెచ్చారు.
- రోడ్లపై ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను ఖాళీ స్థలాల్లోకి తరలిస్తారు.
- భక్తులు ఎక్కడా ఆగకుండా, అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని నిర్ణయించారు.
Also Read :Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ
జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశం
త్రివేణీ సంగమంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ కమిటీ దీనిపై విచారణ జరుపుతుందని ఆయన తెలిపారు. దీనికితోడుగా పోలీసు టీమ్‌తోనూ దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని ఇవాళ యూపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ సందర్శించనున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.