Madhya Pradesh Congress Manifesto : ప్రజలు అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా..

ప్రజలందరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు హామీలతో 59 వాగ్దానాలను ఇచ్చింది

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 08:12 PM IST

తెలంగాణ (Telangana) తో పాటు మరో నాల్గు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (2023 Assembly Elections) జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో నవంబర్ 30 న , మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లో నవంబర్ 17 న , రాజస్థాన్ (Rajasthan ) నవంబర్ 25 న , ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh
) లో నవంబర్ 07 , 17 న , మిజోరం (Mizoram) లో నవంబర్ 07 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టో లను విడుదల చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

తెలంగాణ లో ఇప్పటీకే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ , BSP పార్టీలు మేనిఫెస్టో లను రిలీజ్ చేయగా..తాజాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో (Madhya Pradesh Congress Manifesto) ను విడుదల చేసింది. 59 హామీలతో కూడిన 106 పేజీల మేనిఫేస్టో డాక్యుమెంట్‌ను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ (Kamalnath) విడుదల చేశారు.

ప్రజలందరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు హామీలతో 59 వాగ్దానాలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను కేవలం రూ.500కే అందజేస్తామని పేర్కొంది. దీంతోపాటు రూ.2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజలు అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని.. రూ.10 లక్షల యాక్సిడెంట్ కవరేజ్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మేనిఫేస్టోలో తెలిపింది. ఇక మధ్యప్రదేశ్‌లో క్రీడలను పెంపొందించడం.. ముఖ్యంగా క్రికెట్ కోసం ఏకంగా ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని తెలిపింది. మహిళలకు నెల నెలా రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఉచిత పాఠశాల విద్య, వృద్ధాప్య పెన్షన్ స్కీమ్, నిరుద్యోగులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

Read Also : Chandrababu Case: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. శుక్రవారం ఫైనల్