Site icon HashtagU Telugu

Sonia Gandhi : సోనియాకు కాల్ చేస్తే.. గంట పాటు వెయిట్ చేయించి మాట్లాడలేదు : నజ్మా హెప్తుల్లా

Sonia Gandhi Najma Heptulla Berlin Congress Bjp

Sonia Gandhi : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్‌పర్సన్, బీజేపీ నాయకురాలు నజ్మా హెప్తుల్లా సంచలన కామెంట్స్ చేశారు. 1999లో తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎదురైన అవమానాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

Also Read :Maharashtra CM Suspense : రేపు సీఎంను ఎంపిక చేస్తాం.. బీజేపీకి బేషరతుగా మద్దతిస్తా : షిండే

“నేను 1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్  అధ్యక్షురాలిగా(Sonia Gandhi) ఎన్నికయ్యాను. ఈ విషయాన్ని సోనియా గాంధీకి చెప్పడానికి బెర్లిన్ నుంచి ఫోన్ కాల్ చేశాను.  సోనియా సిబ్బంది నా ఫోన్ కాల్‌ను  లిఫ్ట్‌ చేసి మేడమ్‌ బిజీగా ఉన్నారని చెప్పారు. నేను బెర్లిన్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాను. దీంతో వాళ్లు వెయిట్ చేయమని చెప్పారు. గంట పాటు ఫోన్‌ కాల్‌లోనే వేచి ఉన్నాను. చివరికి సోనియాతో మాట్లాడకుండానే కాల్‌ కట్‌ చేయాల్సి వచ్చింది’’ అని నజ్మా హెప్తుల్లా అలనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్  అధ్యక్షురాలిగా నేను ఎన్నికయ్యాక తొలుత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి కాల్ చేశాను. ఆయన నాతో మాట్లాడి అభినందనలు చెప్పారు’’ అని నజ్మా హెప్తుల్లా తెలిపారు.

Also Read :EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్‌ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?

‘‘ఆ ఘటనతో నేను కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యాను. మరుసటి ఏడాది న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సోనియాను ఆహ్వానించాను. ఆమె చివరి నిమిషంలో హాజరుకాలేదు. ఆ సమయంలో నేను తిరస్కరణ భావానికి లోనయ్యాను’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమొక్రసీ: బియండ్ పార్టీ లైన్స్‌’ పేరుతో తన ఆత్మకథను నజ్మా హెప్తుల్లా విడుదల చేశారు. తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కీలక విషయాలను అందులో ప్రస్తావించారు.‘‘సోనియా గాంధీ నాయకత్వ శైలి ఇందిరాగాంధీ ఆలోచనలకు భిన్నంగా ఉంది. పార్టీ నేతలంటే సోనియాకు చులకన భావం. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాతో విభేదాలు రావడంతో నేను కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరాను’’ అని నజ్మా హెప్తుల్లా తెలిపారు.