Site icon HashtagU Telugu

Pink Moon 2024 : పింక్ మూన్‌కు వేళైంది.. ఇదేమిటి ? ఏ టైంలో కనిపిస్తుంది ?

Pink Moon 2024

Pink Moon 2024

Pink Moon 2024 :  వసంత రుతువు వేళ దర్శనమిచ్చే సంపూర్ణ చంద్రుడిని ‘పింక్ మూన్’‌ అంటారు. ఈ ఫుల్ మూన్‌ను చూసేందుకు వేళయింది. మన దేశ కాలమానం ప్రకారం రేపు (ఏప్రిల్ 24న) ఉదయం 5.19 గంటలకు పింక్ మూన్‌ను మనం చూడొచ్చు. ఆ టైంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సంపూర్ణ చంద్రుడిని చూసే ఛాన్స్ దక్కుతుంది. ఆ టైం నుంచి తెల్లవారకముందు వరకు ఆకాశంలో లిరిడ్ ఉల్కాపాతం  కూడా చోటుచేసుకుంటుంది. అందమైన ఉల్కలు కనువిందు నేలవైపు రాలే సీన్లు కనిపిస్తాయి. పింక్ మూన్ ఈసారి స్పైకా నక్షత్రం దగ్గరగా ఉన్న కన్య రాశిలో కనిపిస్తుందని నాసా అంటోంది. వాస్తవానికి సోమ, మంగళ, బుధవారాల్లో దీన్ని చూడొచ్చు. అయితే పూర్తిస్థాయిలో పింక్ మూన్‌ను చూసేందుకు బెస్ట్ టైం మంగళవారమే అని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఏమిటీ పింక్ మూన్ ?

పూర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణ చంద్రుడినే పింక్ మూన్ అంటారు. అమెరికా, కెనడా సహా ఇతర తూర్పు దేశాల్లోనై ఇవాళ సాయంత్రం 7.49 గంటలకు పింక్ మూన్ కనిపిస్తుంది.పింక్ మూన్ అంటే చాలామంది  గులాబీ రంగులో చంద్రుడు కనిపిస్తాడని భావిస్తుంటారు. వాస్తవానికి అదేం జరగదు.  వసంత కాలంలో వచ్చే తొలి పున్నమిని ఇంగ్లిష్ వాళ్లు పింక్ మూన్ అని పిలుస్తుంటారు. వసంత కాలం ప్రారంభం కాగానే ఉత్తర అమెరికా ప్రాంతంలోని అడవుల్లో వికసించే మోస్ ఫ్లోక్స్ జాతి పువ్వులు పింక్ కలర్‌లో ఉంటాయి. అందుకే ఈ టైంలో వచ్చిన ఫుల్ మూన్‌కు పింక్ మూన్ అనే పేరును పెట్టారు.

Also Read :Temple Tour Package : తెలంగాణలో ‘టెంపుల్​ టూర్ ప్యాకేజ్’.. చాలా తక్కువ రేటుకే!

పింక్ మూన్‌పై తీరొక్క విశ్వాసాలు

Also Read :Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం