Site icon HashtagU Telugu

Slogans : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడు..ప్రాణాలు పోయేలా కొట్టిన స్థానికులు..ఎక్కడంటే !

Pak Zindabad

Pak Zindabad

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఏప్రిల్ 27న కుడుపు ప్రాంతంలోని (Kudupu Area) భత్రా కల్లుర్తి ఆలయ సమీపం(Bhatra Kallurti Temple)లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ సమయంలో ఓ వ్యక్తి “పాకిస్తాన్ జిందాబాద్” (Pakistan Zindabad) అంటూ నినాదాలు చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. అప్పటికప్పుడు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడి, కొంతమంది అతడిపై దాడికి దిగారు. దాడి తీవ్రత అంతులేకుండా ఉండటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

10th Results : రేపే తెలంగాణ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్..ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

కాగా మరణించిన వ్యక్తి శరీరంపై స్పష్టమైన గాయాలు లేకపోవడంతో పోలీసులు మొదట సహజ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతడి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తేలింది. దీంతో ఇది హత్య కేసుగా మారింది. దీపక్ కుమార్ అనే ప్రత్యక్ష సాక్షి వివరాల మేరకు సచిన్ అనే వ్యక్తి ముందుగా దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మొత్తం 25 మంది ఈ దాడిలో పాల్గొనగా.. ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర స్పందిస్తూ.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం చట్ట విరుద్ధమని, అదే సమయంలో దానిపై స్పందనగా వ్యక్తిని చంపడం మరింత తీవ్రం అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో శాంతిని భంగం చేస్తాయని పేర్కొన్నారు. బాధితుడు ఎవరో, అతడు స్థానికుడేనా లేదా వేరే ప్రాంతానికి చెందినవాడా అనేది నిర్ధారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.