Site icon HashtagU Telugu

Lok Sabha Polls 2024: బీజేపీ మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు గానూ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి కె అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్నారు.మొత్తంగా బీజేపీ తొమ్మిది పేర్లను విడుదల చేసింది.

బుధవారం చెన్నైలో అన్నామాలి సమక్షంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీలో చేరారు. గవర్నర్‌గా పనిచేసిన ఆమె బీజేపీలో చేరినందుకు తమిళిసై వామపక్షాలు, డీఎంకే విమర్శలు గుప్పించింది. కాగా విమర్శలపై ఆమె మాట్లాడుతూ..ఉన్నత పదవుల్లో ఉన్నవారు సాధారణ వ్యక్తిగా ప్రజల కోసం మళ్లీ పనిచేయడం బీజేపీలోనే సాధ్యమని కౌంటర్ ఇచ్చింది. అరవై రెండేళ్ల తమిళిసై సౌందరర్జన్ గైనకాలజిస్ట్ మరియు ఆమె రెండు దశాబ్దాల క్రితం బీజేపీలో చేరారు.

లోక్‌సభకు బీజేపీ మూడో జాబితా
1. చెన్నై సౌత్ – తమిళిసై సౌందరరాజన్
2. చెన్నై సెంట్రల్ – వినోజ్ పి. సెల్వం
3. వెల్లూరు – AC షణ్ముగం
4. కృష్ణగిరి – సి.నరసింహన్
5. నీలగిరి (SC) – L. మురుగన్
6. కోయంబత్తూర్ – కె. అన్నామలై
7. పెరంబలూరు – టీఆర్‌పరివేంధర్
8. తూత్తుకుడి – నైనార్ నాగేంద్రన్
9. కన్నియాకుమారి – పొన్. రాధాకృష్ణన్

Also Read: Nagarkurnool: కొడుకు కంటే శారీరక సుఖమే ఎక్కువైంది ఓ తల్లికి