Site icon HashtagU Telugu

Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఎఐఎడిఎంకె బిజెపితో పొత్తుకు నిరాకరించిందని అసదుద్దీన్ అన్నారు. కాగా భవిష్యత్తులో ఎఐఎడిఎంకె బీజేపీతో పొత్తు పెట్టుకోదని స్పషం చేశారు. అంతేకాదు బీజేపీ అమలు చేసిన ఎఐఎడిఎంకె CAA, NPR & NRCని వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చినట్టు ఒవైసి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కూడా మా పొత్తు కొనసాగుతుంది అని ఒవైసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, బీజేపీలది సంక్లిష్టమైన చరిత్ర. గతంలో ఎఐఎడిఎంకె బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో భాగంగా ఉంది. అయితే ఇప్పుడు అది బిజెపితో బంధాన్ని తెంచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్‌డిఎ నుండి వైదొలిగింది. ఎఐఎడిఎంకె నాయకత్వం బిజెపితో ఎన్నికల సంబంధాలను పునరుద్దరించకూడదని, కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కాకుండా భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో బీజేపీతో ఎలాంటి పొత్తులకు తావు లేదని స్పష్టం చేసింది.

2024 లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగాల్సి ఉంది. ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. మొదటి దశలో 102, రెండో దశలో 89, మూడో దశలో 94, నాలుగో దశలో 96, ఐదో దశలో 49, ఆరో దశలో 57, ఏడో దశలో 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు తమిళనాడులో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 19న ఒకే దశలో జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు