Site icon HashtagU Telugu

Congress Boycott Exit Poll: ఎగ్జిట్‌ పోల్స్‌పై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం..!

Congress Boycott Exit Poll

Telangana Congress MPs dharna in Delhi

Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్‌ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్‌ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్సన్‌ పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. ఏడో, చివరి దశ ఓటింగ్ నేడు జరగనుంది. దీని తరువాత జూన్ 4 ఉదయం కౌంటింగ్ ప్రారంభమయ్యే వరకు అందరూ వేచి ఉన్నారు. దీనికి ముందు జూన్ 1వ తేదీ నుంచే మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాల స్థూలమైన రూపురేఖలు ఇవ్వగలవు. మధ్యప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి సీక్వెల్ ఉంది.. ఆ స్టోరీ థీమ్ చెప్పిన విశ్వక్ సేన్..

ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ చర్చను బహిష్కరించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఎంపీలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎలాంటి చర్చలో కాంగ్రెస్ పాల్గొనదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసీసీ సూచనల మేరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం గురించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తన అధికార ప్రతినిధులు, పెద్ద నేత‌ల‌కు క‌మిటీ తెలియజేసింది. జూన్ 1న ఏడో దశ ఓటింగ్ తర్వాత దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో ఎగ్జిట్ పోల్స్ చూపబడతాయని మన‌కు తెలిసిందే. జూన్ 1 సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ప్రసారం ప్రారంభమవుతాయి. ఎగ్జిట్ పోల్స్‌పై ఎలాంటి టీవీ చర్చలో పాల్గొనవద్దని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసింది.

We’re now on WhatsApp : Click to Join

ఎన్నికల సంఘం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ గెలుపు ఓటములపై ​​ఎగ్జిట్ పోల్ అంచనాలు జూన్ 1న వెల్లడికానుండగా, వీటికి సంబంధించి రెండు పార్టీలలో ఏదో గెలుపో స్ఫ‌ష్టంగా తెలిసే అవ‌కాశం ఉంటుంది.