Lok Sabha Polls Phase 1 2024 : ఓటు వేసిన ప్రముఖులు..ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపు

సూపర్ స్టార్ రజనీకాంత్ , అజిత్ , ధనుష్ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు.

Published By: HashtagU Telugu Desk
Rajani Vote

Rajani Vote

దేశ వ్యాప్తంగా మొదటివిడత సార్వత్రిక ఎన్నికల ((Lok Sabha Election 2024)) పోలింగ్ మొదలైంది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలు కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ , రాజకీయ , పలు రంగాల వారు పోటీ పడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడం తో ఉదయాన్నే పోలింగ్ సెంటర్ కు చేరుకొని తమ ఓటు ను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఈ సందర్బంగా కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ , అజిత్ , ధనుష్ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు. అలాగే తమిళనాడు సీఎం, రాజస్థాన్ సీఎం ,మాజీ సీఎం కమల్‌ నాథ్‌, తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మొదలగు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని 39 లోక్‌సబ నియోజకవర్గాలతోపాటు రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌పర్దేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో ఆరు, మహారాష్ట్రలో ఐదు పార్లమెంట్ స్థానాలకి కూడా మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి విడతలో బరిలో నిల్చిన నేతలు వీరే..

కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ(నాగ్‌పూర్‌ నియోజకవర్గం), కిరెన్‌ రిజిజు(అరుణాచల్‌ వెస్ట్‌), సంజీవ్‌ భలియా(ముజఫర్‌నగర్‌), జితేంద్ర సింగ్‌(ఉధమ్‌పూర్‌), అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌(బికనీర్‌), ఎల్‌.మురుగన్‌(నీలగిరి), శర్బానంద సోనోవాల్‌(దిబ్రూగఢ్‌), భూపేంద్ర యాదవ్‌(అల్వార్‌) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్‌ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్‌ కె.అన్నామలై, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ తనయుడు నకుల్‌నాథ్, లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్‌ ప్రసాద, నితిన్‌ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌తదితరులు బరిలో ఉన్నారు.

Read Also : Mansoor Ali Khan : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ను హత్య చేసేందుకు కుట్ర..?

  Last Updated: 19 Apr 2024, 10:08 AM IST