Advani Invited : అద్వానీ, జోషిలను మేం ఆహ్వానించాం.. జనవరి 22న అయోధ్యకు వస్తారు : వీహెచ్‌పీ

Advani Invited : ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ దిగ్గజ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కోరాను.

Published By: HashtagU Telugu Desk
Advani Ram Mandir

Advani Ram Mandir

Advani Invited : ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ దిగ్గజ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కోరాను. వాళ్లు అంగీకరించారు. వయోభారాన్ని ఎదుర్కొంటున్నందున వారికి ఈ రిక్వెస్ట్ చేశాను’’ అని అయోధ్య రామాలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా స్పందించింది. జనవరిలో జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను తాము ఆహ్వానించామని వీహెచ్‌పీ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

అద్వానీని రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న ఒక ఫొటోతో ఇవాళ మధ్యాహ్నం వీహెచ్‌పీ ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు. అద్వానీ, జోషిలు లేకుండా రామ మందిర సాధన దిశగా ఉద్యమాన్ని ఊహించనే లేమని కొందరు వ్యాఖ్యానించారు. రామమందిర ప్రారంభోత్సవంలో వారు తప్పకుండా పాల్గొనాలని డిమాండ్ చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగే  రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ, జోషిలను ఆహ్వానించామని వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. ఆ కార్యక్రమానికి రావడానికి తప్పకుండా ట్రై చేస్తామని వారు చెప్పారని(Advani Invited) వెల్లడించారు. VHP అనేది BJP యొక్క సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన సంఘ్ పరివార్‌లో ఒక భాగం.

Also Read: CM Revanth Reddy : ఇవాళ, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. పర్యటన వివరాలివీ

  Last Updated: 19 Dec 2023, 04:10 PM IST