Worlds Corrupt Countries: ప్రస్తుతం అవినీతి (కరప్షన్) విశ్వవ్యాప్తమైంది. ప్రతీ దేశంలో అవినీతి బలంగా పాతుకుపోయింది. అవినీతిపరులు లంచాలు పుచ్చుకుంటూ ప్రతీ వ్యవస్థను గుల్లబారుస్తున్నారు. రోడ్ల నిర్మాణం దగ్గరి నుంచి నల్లా నీటి పంపిణీ దాకా ప్రతీచోటా క్వాలిటీ లేకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ (టీఐ) సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ను విడుదల చేసింది. దీనిలో మన దేశం స్థానం ఎంత ? ప్రపంచంలోనే నంబర్ 1 అవినీతిరహిత దేశం ఏది ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
నివేదికలోని కీలక అంశాలివీ..
- ప్రపంచంలో అవినీతి అత్యల్పంగా ఉన్న దేశం డెన్మార్క్. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ నివేదికలో ఈ దేశమే నంబర్ 1 స్థానంలో నిలిచింది.
- ఈ జాబితాలో 96వ స్థానంలో భారత్(Worlds Corrupt Countries) ఉంది.
- ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన గత నివేదికలతో పోలిస్తే భారత్ స్కోరు స్వల్పంగా తగ్గింది.
- 2022 నివేదికలో భారత్ 40 పాయింట్లు, 2023 నివేదికలో 38 పాయింట్లు, 2024 నివేదికలో 38 పాయింట్లు సాధించింది.
- చైనా 76వ స్థానం, శ్రీలంక 121 స్థానం, పాకిస్తాన్ 135వ స్థానం, బంగ్లాదేశ్ 149 స్థానంలో నిలిచాయి.
- అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనిజువెలాలో అవినీతి పెరిగిందని నివేదిక తెలిపింది.
- అమెరికా స్కోరు 69 నుంచి 65 పాయింట్లకు తగ్గడంతో, దాని ర్యాంకు 24 నుంచి 28కి డౌన్ అయింది.
- ఫ్రాన్స్ నాలుగు పాయింట్లు కోల్పోయి 25వ స్థానానికి పరిమితమైంది.
- జర్మనీ మూడు పాయింట్ల కోల్పోయి 75 స్కోరుతో 15వ ర్యాంకును సాధించింది.
- సౌత్ సుడాన్ దేశం 8 పాయింట్లతో అత్యంత అవినీతిమయ దేశంగా నిలిచింది.
- సోమాలియా 9 పాయింట్లు, వెనెజువెలా 10 పాయింట్లు, సిరియా 12 పాయింట్లతో సౌత్ సుడాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- మొత్తం 180 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు.
- అత్యంత అవినీతిమయ దేశాలకు సున్నా స్కోరు, అవినీతి లేని దేశాలకు 100 స్కోరును ఈ నివేదికలో కేటాయించారు.