Zakir Naik : ఇస్లామిక్ బోధకుడు జాకిర్ నాయక్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ చేస్తున్న డిమాండ్‌పై మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కీలక వ్యాఖ్యలు చేశారు. జాకిర్ నాయక్(Zakir Naik) భారత్‌లో ఏవైనా తప్పులు చేసినట్టుగా సాక్ష్యాలను చూపిస్తే.. ఆయనను తప్పకుండా అప్పగిస్తామని ఆయన మంగళవారం స్పష్టంచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మలేషియా ప్రధాని ప్రసంగించారు. మలేషియా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలకు ఈ ఒక్క అంశం ఆటంకంగా మారకూడదని ఆయన చెప్పారు. మంగళవారం రోజు జరిగిన చర్చల సమయంలో ఈ సమస్యను భారత్ తమ ఎదుట లేవనెత్తలేదని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మొదట ఈ అంశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీయే లేవనెత్తారు. నేను ఒక్క వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మొత్తం సెంటిమెంటు గురించి మాట్లాడుతున్నాను. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రజలపై దురాగతాలకు పాల్పడితే దాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తారు. అలాంటి అకృత్యాలకు జాకిర్ నాయక్ పాల్పడలేదు కదా..’’ అని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రశ్నించారు. ‘‘పాలస్తీనాలోని గాజా ప్రాంత ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న దాడి తీవ్రవాదం. ఇప్పటిదాకా ఇజ్రాయెలీ సైనికులు కలిసి 40వేల మంది పాలస్తీనీయుల ప్రాణాలు తీశారు. అది అతివాదం, ఉగ్రవాదం’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Free Bus Facility : మహిళలకు ఉచిత ప్రయాణం.. అధికారుల నివేదికలో కీలక సిఫారసులు
‘‘భారత్ ఇప్పటికైనా జాకిర్ నాయక్ లాంటి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడటం వదిలేయాలి. పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న హింసాకాండ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలపై మాట్లాడాలి’’ అని మలేషియా ప్రధానమంత్రి సూచించారు. భారత సర్కారు మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాల అభియోగాలతో జాకిర్ నాయక్‌పై కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన 2016లో దేశాన్ని వదిలి సౌదీ అరేబియాకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మలేషియాకు వెళ్లారు. మలేషియా సర్కారు జాకిర్ నాయక్‌కు శాశ్వత నివాస అనుమతులను మంజూరు చేశారు.