Lawrence Bishnoi : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గుజరాత్ జైలులో ఉన్నా.. అతడి గ్యాంగ్ మాత్రం యావత్ దేశంలో రెచ్చిపోతోంది. తాజాగా బిహార్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపు వచ్చింది. సల్మాన్ ఖాన్ – లారెన్స్ బిష్ణోయి వ్యవహారంపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని పప్పూ యాదవ్‌కు లారెన్స్ గ్యాంగ్ సూచించింది. ఒకవేళ తమ మాట వినకుండా తగిన యాక్షన్ తీసుకుంటామని బెదిరించింది. పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని లారెన్స్ గ్యాంగ్ పేర్కొనడం గమనార్హం. ఈమేరకు రికార్డెడ్ ఆడియో మెసేజ్ ఒకటి పప్పూ యాదవ్ ఫోనుకు వచ్చింది. అందులో పైవివరాలను ప్రస్తావించారు.
Also Read :Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు
‘‘గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతీ సెంట్రల్ జైలులో ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయి ఉన్నాడు. ఆ జైలులో ఉన్న సిగ్నల్ జామర్లను డిజేబుల్ చేయడానికి గంటకు రూ. 1 లక్ష చొప్పున చెల్లిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ పప్పూ యాదవ్‌తో లారెన్స్(Lawrence Bishnoi) మాట్లాడటానికే. లారెన్స్ కాల్స్‌ను పప్పూ యాదవ్ ఎత్తడం లేదు’’ అని ఆ ఆడియో క్లిప్‌లో సదరు దుండగుడు పేర్కొన్నాడు. ‘‘మీడియానే మీ మాటలను వక్రీకరించి ఉండొచ్చు. సాధ్యమైనంత త్వరగా లారెన్స్ భాయ్‌తో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోండి. లేదంటే మీకే ఇబ్బంది అవుతుంది. మిమ్మల్ని పెద్ద అన్నగా భావించి ఈ సలహా ఇస్తున్నాా. నాకు కాల్ చేయండి.. లారెన్స్ భాయ్‌తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను’’ అని దుండగుడు ఆడియో క్లిప్‌లో ప్రస్తావించాడు.
Also Read :Wife Murders Husband : ఆస్తి కోసం భర్తను తెలంగాణలో చంపి.. కర్ణాటకలో తగలబెట్టిన భార్య
ముంబైలో అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ ఇటీవలే దారుణ హత్యకు గురయ్యాడు. బాబా సిద్దిఖీ.. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ హత్యా ఘటన అనంతరం స్పందించిన పప్పూ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లారెన్స్ బిష్ణోయి నా ముందు బచ్చా.. రెండు అణాలకు కూడా పనికిరాని గూండా అతడు. చట్టం అనుమతిస్తే లారెన్స్ గ్యాంగ్‌ను 24 గంటల్లో తుద ముట్టిస్తా’’ అని పప్పూ యాదవ్ కామెంట్ చేశారు.