దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరల (fuel Prices) పెంపుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని ఆరోపిస్తూ, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ‘‘ఇంధన ధరలు పెంచి మరోసారి ప్రజల వెన్ను విరిచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
YS Jagan: త్వరలో జగన్ డ్రెస్ మారుతుందా.. నెంబర్ కూడా వస్తుందా..?
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు క్షీణిస్తున్న సమయంలో భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ప్రపంచ దేశాల్లోకి పోలిస్తే ఇండియాలోనే చమురు, ఎల్‌పీజీ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఇదెందుకు? ముడి చమురు ధరలు తగ్గినా, ఇంధన ధరలను తగ్గించకుండా ఎందుకు పెంచుతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఇది సామాన్య జనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వినియోగదారుల జీవితాన్ని భారంగా మారుస్తుందని అన్నారు.
సామాన్య ప్రజల నిత్యజీవితంపై భారాన్ని తగ్గించేందుకు ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని BRS తరపున డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపారు. ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఇంధన ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.