Modi : కొంపెల్ల మాధవీలత ఫై ప్రధాని మోడీ ప్రశంసలు..

‘‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా అద్భుతమైన అంశాలు లేవనెత్తారు. వాటిలో లాజిక్ తో పాటు ప్యాషన్ కూడా ఉంది. మీకు నా శుభాకాంక్షలు.

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 02:46 PM IST

కొంపెల్ల మాధవీలత (Kompella Madhavi Latha) ఫై ప్రధాని మోడీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. కొంపెల్ల మాధవీలత ఈ పేరు గత కొద్దీ నెలలుగా మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా బిజెపి ఈమెను ప్రకటించిన దగ్గరి నుండి ఈమె ఎవరు..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలుసుకునేపనిలో చాలామంది పడ్డారు.

ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌. విరించి గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌‌ను 2001లో ఈమె పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. విరించి ఆస్పత్రి సీఎండీగా మాధవీ లత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇలా ఎంతో గుర్తింపు ఉండడం తో ఈమెకు బిజెపి హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్న ఈమె ఫై తాజాగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తూ తన ట్విట్టర్ ట్వీట్ చేయడం తో…ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. మాధవీ లత ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. దానిపై మోడీ స్పందించారు. ఆ టీవీ కార్యక్రమంలో మాధవీ లత పంచుకున్న విషయాలు ఎంతో ప్రత్యేకమైనవని మోడీ కొనియాడారు. మాధవీ లత ఆలోచనల్లో లాజిక్ తో (తర్కం) పాటు అభిరుచి (ప్యాషన్) కూడా ఉందని అన్నారు. మాధవీ లత పాల్గొన్న టీవీ షోను అందరూ చూడాలని పిలుపు ఇచ్చారు. అందులో ఎన్నో పనికొచ్చే అంశాలు ఉన్నాయని.. ఆ షో పున:ప్రసారాన్ని అందరూ తప్పకుండా చూడాలని మోడీ కోరారు.

‘‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా అద్భుతమైన అంశాలు లేవనెత్తారు. వాటిలో లాజిక్ తో పాటు ప్యాషన్ కూడా ఉంది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ పున:ప్రసారాన్ని చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీ అందరికీ ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది’’ అని మోడీ ట్విట్టర్ (X) లో పేర్కొన్నారు. మోడీ ట్వీట్ చేయడం తో అంత ఆమె గురించి మాట్లాడుకోవడం..ఆమె తాలూకా వివరాలు తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు.

Read Also : Dil Raju: ఫ్యామిలీ స్టార్ కోసం అలాంటి పనిచేసిన దిల్ రాజు.. థియేటర్స్ ముందు రివ్యూస్ అడుగుతూ!