Kingfisher Beer: బీర్ ప్రియులకి షాక్.. కింగ్‌ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం

రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను కర్ణాటక ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. కిగ్‌ఫిషర్ బీర్ల (Kingfisher Beer)లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది.

Published By: HashtagU Telugu Desk
Prices Of Liquor

Beer Benefits

Kingfisher Beer: రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను కర్ణాటక ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. కిగ్‌ఫిషర్ బీర్ల (Kingfisher Beer)లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. రసాయన పరీక్ష నివేదికలో ఇది మానవ వినియోగానికి పనికిరాదని తేలింది. కేసు నమోదు చేయడమే కాకుండా స్టాక్‌ను ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మైసూరు రూరల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. రవిశంకర్ తెలిపారు.

మైసూరు జిల్లా నంజన్‌గూడలోని యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ కిగ్‌ఫిషర్ బీర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు తేలింది. కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7E, 7C బీర్లలో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆ కంపెనీ వద్దకు వచ్చి బీర్లను పరిశీలించారు. వెంటనే ఆ బీర్ల శాంపిల్స్‌ను పంపించారు. అయితే ఆ బీర్లకు సంబంధించి ఆగస్టు 2 వ తేదిన కెమికల్ రిపోర్టు అందింది. ఆ రిపోర్టులో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉనట్లు నిర్ధారణ అయింది. అసలు ఈ బీర్లు మానవులు వినియోగించడానికి వీలు లేదని ఆ నివేదిక పేర్కొంది. వీలనైంత త్వరగా వాటి ఉత్పత్తిని ఆపేయాలని సూచించింది.

Also Read: Telangana: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు నొక్కేసిన కేసీఆర్: షర్మిల

మైసూర్‌కి చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా యునైటెడ్ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ యొక్క నంజన్‌గూడ్‌ యూనిట్‌లో 2023 జులై17న తయారు చేసిన కింగ్‌ఫిషర్ బీర్‌లు తాగేందుకు పనికి రావని తేల్చారు. ఎక్సైజ్‌శాఖ సీజ్ చేసిన 25 కోట్ల రూపాయల కింగ్‌ ఫిషర్ బీర్‌లను ధ్వంసం చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే దీనిపై కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా బీర్‌లు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్‌ లిమిటెడ్ ఎక్సైజ్‌శాఖ ఆదేశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉండటంపై మద్యం ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

  Last Updated: 17 Aug 2023, 03:13 PM IST