khel Ratna Award : పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించి భారత షూటర్ మను బాకర్‌కు ఖేల్‌రత్న అవార్డును కేంద్రం ప్రకటించింది. మనుభాకర్ తోపాటు ప్రపంచ చెస్ ఛాంపియన్ విజేత డి గుకేష్‌ను కూడా ఖేల్ రత్న అవార్డుతో కేంద్ర సత్కరించింది. యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఖేల్ రత్న అవార్డులు పొందే క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.
మను బాకర్- షూటింగ్
హర్మన్‌ప్రీత్- సింగ్ హాకీ
ప్రవీణ్ కుమార్- పారా అథ్లెట్
డి.గుకేశ్- చెస్
మను బాకర్ (షూటింగ్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్), డి.గుకేశ్ (చెస్) ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. ఈ అత్యున్నత అవార్డులను జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది అర్జున అవార్డులు కూడా కేంద్రం ప్రకటించింది. మొత్తం 32 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. అందులో 17మంది పారా అథ్లెట్లు ఉన్నారు. అందులో తెలంగాణ పారాఅథ్లెట్ దీప్రి జివాంజి కూడా అర్జున అవార్డుకు ఎంపికైంది.
అర్జున అవార్డుకు ఎంపికైన అథ్లెట్లు..
.జ్యోతి యర్రాజీ – అథ్లెటిక్స్
.అన్నూ రాణి – అథ్లెటిక్స్
.నీతూ – బాక్సింగ్
.సావీటీ – బాక్సింగ్
.వంటికా – అగర్వాల్ చెస్
.సలీమా – టెటే హాకీ
.అభిషేక్ – హాకీ
.సంజయ్ – హాకీ
.జర్మన్‌ప్రీత్ సింగ్ – హాకీ
.సుఖజీత్ సింగ్ – హాకీ
.రాకేష్ కుమార్ – పారా ఆర్చరీ
.ప్రీతి పాల్ – పారా అథ్లెటిక్స్
.జీవన్‌జీ దీప్తి – పారా అథ్లెటిక్స్
.అజీత్ సింగ్ – పారా అథ్లెటిక్స్
.సచిన్ సర్జేరావు ఖిలారీ – పారాఅథ్లెటిక్స్
.ధరంబీర్ -పారాఅథ్లెటిక్స్
.ప్రణవ్ సూర్మ – పారా అథ్లెటిక్స్
.హెచ్ హోకాటో సెమా – పారా అథ్లెటిక్స్
.సిమ్రాన్ – పారాఅథ్లెటిక్స్
.నవదీప్ – పారా అథ్లెటిక్స్
.నితీశ్ కుమార్ – పారా బ్యాడ్మింటన్
.తులసిమతి మురుగేషన్ – పారా బ్యాడ్మింటన్
.నిత్య శ్రీ సుమతి శివన్ – పారా బ్యాడ్మింటన్
.మనీషా రామదాస్ – పారా బ్యాడ్మింటన్
.కపిల్ పర్మార్ – పారా జూడో
.మోనా అగర్వాల్ – పారాషూటింగ్
.రుబీనా ఫ్రాన్సిస్ – పారా షూటింగ్
.స్వప్నిల్ సురేష్ కుసలే – షూటింగ్
.సరబ్జోత్ సింగ్ – షూటింగ్
.అభయ్ సింగ్ – స్క్వాష్
.సజన్ ప్రకాష్ – స్విమ్మింగ్
.అమన్ – రెజ్లింగ్
Read Also: Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు