Site icon HashtagU Telugu

Bharat Jodo Nyay Yatra : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్‌లైన్ ఆవిష్కరణ

Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra : జనవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్ లైన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.  ఈ యాత్ర కోసం  “న్యాయ్ కా హక్ మిల్నే తక్” అనే ట్యాగ్‌లైన్‌ను నిర్ణయించామని ఆయన ప్రకటించారు.  మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ముంబై వరకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’  జరుగుతుందని తెలిపారు.  దేశంలోని 15 రాష్ట్రాల మీదుగా ఇది కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్ర 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తుందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేను ప్రమాణం చేస్తున్నాను.. : రాహుల్

ఈసందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ..  ‘‘అన్యాయం, అహంకారానికి వ్యతిరేకంగా  న్యాయ నినాదంతో  దేశ ప్రజల మధ్యకు తిరిగి వెళ్తున్నా’’ అని తెలిపారు.  ‘‘నేను ప్రమాణం చేస్తున్నాను.. దేశ ప్రజలకు  న్యాయం లభించే వరకు ఈ యాత్రను కొనసాగిస్తాను’’ అని పేర్కొన్నారు. ఈమేరకు వీడియో సందేశంతో ఆయన ఒక ట్వీట్ చేశారు.

Also Read: Ayodhya – January 22 : జనవరి 22నే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఎందుకు ?

67 రోజుల్లో 6,700 కిలోమీటర్ల యాత్ర

67 రోజుల్లో 6,700 కిలోమీటర్లకుపైగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్  పార్టీ అధికార ప్రతినిధి ధనంజయ్ ఠాకూర్ తెలిపారు. ఈ యాత్ర ఫిబ్రవరి 16, 17 తేదీల తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు చేరుకుంటుందని, ఐదు రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుందన్నారు. ‘‘ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు సత్యాగ్రహం అనేది బలమైన ఆయుధంగా కాంగ్రెస్ భావిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో జరిగిన అతిపెద్ద సత్యాగ్రహంగా ‘భారత్ జోడో న్యాయ్’ పాదయాత్ర నిలుస్తుంది’’ అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ యాత్ర ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాలను సమూలంగా మార్చే యాత్ర

‘‘కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎలాగైతే ప్రభావాన్ని చూపించిందో.. ఇప్పుడు చేయనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా అదేవిధంగా దేశ రాజకీయాలను సమూలంగా  మార్చేస్తుంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 90 సభ్యుల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది, 2018లో 68కి తగ్గింది. గోండ్వానా గంతంత్ర పార్టీ ఒకటి గెలుచుకోగలిగింది.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ వలె రాజకీయాలను మార్చే విధంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర నిరూపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ గతంలో పేర్కొన్నారు.