Bhindranwales Nephew : జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది. 1984 జూన్ మొదటివారంలో భింద్రన్‌వాలేతో పాటు పలువురు ఉగ్రవాదులు కలిసి ఆయుధాలు చేతపట్టి.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంలో దాక్కున్నారు. దీంతో ఇందిరాగాంధీ సాహసోపేతంగా స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించి ఉగ్రవాదులందరినీ ఏరిపారేశారు. ఆ ఘటన తర్వాత భింద్రన్‌వాలే మేనల్లుడు లఖ్‌బీర్ సింగ్ రోడే దుబాయ్‌కు.. అక్కడి నుంచి పాకిస్తాన్‌కు పారిపోయాడు. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొంది పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్న లఖ్‌బీర్ సింగ్ రోడే 72 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయాడు. సోమవారమే అతడు పాక్‌లో చనిపోయాడని ఒక ప్రధాన భారతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
We’re now on WhatsApp. Click to Join.
లఖ్బీర్ వాస్తవానికి పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందినవాడు. కానీ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ తర్వాత అతడు తొలుత దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లాడు. అయితే తన కుటుంబాన్ని మాత్రం కెనడాలో ఉంచాడు. అతడి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య కెనడాలో నివసిస్తున్నారు. 2002లో తొలిసారిగా 19 మంది ఉగ్రవాదులతో పాటు అతడిని అప్పగించాలని భారత ప్రభుత్వం పాక్‌ను డిమాండ్ చేసింది. లఖ్‌బీర్ సింగ్ రోడేను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టులో భారత్ చేర్చింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఉన్నలఖ్‌బీర్ భూమిని జప్తు చేయాలని మొహాలీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ఇటీవల(Bhindranwales Nephew) ఆదేశించింది.