PM Modi : ఈరోజు మధ్యాహ్నం భారత్ డీజీఎంఓ రాజీవ్ ఘయ్, పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ ఇరువురు సైనిక ఉన్నతాధికారులు కాల్పుల విరమణ అంశం గురించి హాట్‌లైన్‌లో చర్చించుకోనున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులపై వీరి మధ్య డిస్కషన్ జరగనుంది. కాల్పుల విరమణను కొనసాగించే అంశంపై ప్రధాన ఫోకస్‌తో ఈ ఇద్దరి చర్చలు జరుగుతాయి.
Also Read :Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?
ప్రధాని మోడీ నివాసంలో భేటీ.. ఎందుకు ?
ఈనేపథ్యంలో భారత్, పాక్ డీజీఎంవోల స్థాయి సమావేశంపై చర్చించేందుకు కాసేపటి ముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) నివాసంలో కీలక సమావేశం మొదలైంది. కాల్పుల విరమణపై భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ ద్వారా పాకిస్తాన్ డీజీఎంఓకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీరు, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆదివారం రోజే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన చేశారు. ఎప్పటివరకు ఈ ఆదేశాలను కంటిన్యూ చేయాలనే దానిపై ప్రధాని సమీక్షించనున్నారు. పాకిస్తాన్, చైనా సరిహద్దులపై నిఘా కోసం అత్యాధునిక శాటిలైట్ టెక్నాలజీని వాడుకోవడంపైనా భారత్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ నిర్వహించిన ఈ సమావేశానికి సీడీఎస్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఇక ఈరోజు పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల తర్వాత భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Also Read :Mahesh Babu : ఈరోజు ఈడీ ఎదుటకు మహేష్ బాబు.. ఏమిటీ కేసు?
రాజస్థాన్‌లో జనజీవనం సాధారణ స్థితికి
భారత్ – పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తగ్గడంతో పశ్చిమ సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్‌లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఈ రాష్ట్రంలోని బార్మర్‌లో ఇవాళ ఉదయం మార్కెట్లు, దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు తమ దినచర్యలను మొదలుపెట్టారు. జైసల్మీర్‌కు చెందిన ఒక స్థానికుడు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు అంతా సాధారణంగానే ఉంది. మార్కెట్ తెరిచి ఉంది. పగటిపూట ఎటువంటి సమస్యలు లేవు. దుకాణాలను రాత్రి 7:30 గంటలకు మూసివేస్తున్నారు. మా జీవనోపాధికి ఎటువంటి నష్టం జరగలేదు’’ అని చెప్పాడు. అంతకుముందు శనివారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో పాకిస్తాన్ క్షిపణి శకలం పడింది. దాన్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది.