Kejriwal : ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగిన ఈ సమావేశం పలువురు రాజకీయ నాయకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.
Read Also: Manda Krishna – Revanth : నిన్నటివరకు శత్రువు..నేడు సోదరుడు..ఇదే రాజకీయం
మాన్‌ని సీఎంగా తొలగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాజౌరి గార్డెన్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. భగవంత్ మాన్ సరిగా పనిచేయడం లేదనే ముద్ర వేయడ ద్వారా ఆయనను తొలగిచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వైఫల్యాలకు మాన్‌ని బాధ్యుడిని చేసి, కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనునకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అయితే దీనిపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. నవ్వుతూ వాళ్లు చెప్పనివ్వండి అని అన్నారు. పంజాబ్‌లోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దాదాపు మూడేళ్లుగా ప్రతాప్ బజ్వా ఇదే మాట చెబుతున్నారని, ఢిల్లీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను మూడో సారి లెక్కించండి అంటూ ఎద్దేవా చేశారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా స్థానాలు సాధించిందని భగవంత్ మాన్ ఎగతాళి చేశారు.
కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా తనతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని గత మూడేళ్లుగా చెబుతున్నారని, ముందుగా ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఎన్ని సీట్లో గెలిచిందో లెక్కబెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వరుసగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈసారి ఓటు షేర్‌ను మాత్రం పెంచుకోగలిగింది.
Read Also: Rahul Gandhi : రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు..