Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే ఏడుసార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ తాజాగా విచారణకు అవుతానని స్పష్టం చేశారు సీఎం కేజ్రీవాల్.

ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు. అయితే ఈడీ సమన్లు ​​చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈడీ సమన్లు ​​చట్టవిరుద్ధమని, అయితే దర్యాప్తు సంస్థల ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ తనకు కొన్ని రోజుల సమయం కావాలని చెప్పారు. తనను ప్రశ్నించేందుకు మార్చి 12 తర్వాత ఏదైనా తేదీ ఇవ్వాలని కోరారు. కాగా ఈడీ విచారణను నేరుగా ఎదుర్కోలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పారు.

Also Read: Gutti Kakarakaya: గుత్తి కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చాలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?

  Last Updated: 04 Mar 2024, 11:12 AM IST