భారత క్రికెట్ జట్టుకు తమదైన శైలితో సేవలందించిన కేదార్ జాదవ్ (Kedar Jadhav) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలకంగా మారేలా బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవానులే (BJP President Chandrashekhar Bawankule) సమక్షంలో కేదార్ జాదవ్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికాయి. క్రికెట్ ద్వారా దేశానికి పేరు తెచ్చిన కేదార్.. ఇక ప్రజాసేవ కోసం రాజకీయాల్లో అడుగుపెడతానని తెలిపారు.
YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
కేదార్ జాదవ్ భారత తరఫున 73 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లలో పాల్గొన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలక సమయాల్లో మ్యాచ్‌ను తిప్పే ఆటగాడిగా పేరుగాంచారు. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినప్పటికీ, ఆయన అనూహ్యమైన ఆఫ్ స్పిన్‌తో అనేక వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన జాదవ్, ఐపీఎల్‌లో కోచ్చి టస్కర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడారు.
గత ఏడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్, ఇప్పుడు రాజకీయాల్లో తన ప్రయాణం ప్రారంభించారు. బీజేపీలో చేరిన కేదార్ జాదవ్‌కు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం లభించే అవకాశముంది. స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండగా, జాదవ్ చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.