Kavitha : `ఏచూరి` బాస‌ట‌, ఎర్ర‌బ‌డ్డ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్

`క‌మ్యూనిజానికి కాలం చెల్లింది. క‌మ్యూనిస్ట్ ల‌కు విలువ లేకుండా పోయింది. `

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 04:18 PM IST

`క‌మ్యూనిజానికి కాలం చెల్లింది. క‌మ్యూనిస్ట్ ల‌కు విలువ లేకుండా పోయింది. ` ఇదీ త‌ర‌చూ ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో (Kavitha)వినిపించే మాట‌. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఒక‌ప్పుడు జాతీయ స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ పార్టీలు ఇప్పుడు బ‌ల‌హీన‌ప‌డ‌డానికి స్వ‌యంకృతాప‌రాధం పెద్ద కార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కు తాజాగా క‌విత ఢిల్లీ వేదిక‌గా చేసిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్(Women reservation) డిమాండ్ ను తీసుకుందాం. ఒక వైపు ఆమె మీద ఈడీ కేసు వేలాడుతున్న సంగ‌తి తెలుసు. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా కేసు విచార‌ణ ముందు రోజు ఆమె మ‌హిళా రిజ‌ర్వేష‌న్ కోసం దీక్షకు దిగారు. ఆ దీక్ష‌కు క‌మ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి లాంటి వాళ్లు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

  క‌విత దీక్ష‌కు క‌మ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి మ‌ద్ధ‌తు (Kavitha)

ఏదైనా అనుస‌రించిన త‌రువాత ఇత‌రుల‌కు చెప్పాల‌నే సూత్రాన్ని క‌మ్యూనిస్ట్ లు బాగా అనుస‌రిస్తారు. అలాంటి వాళ్ల‌కు మాత్ర‌మే మ‌ద్ధ‌తు ఇస్తుంటారు. కానీ, క‌విత(Kavitha) ఆ సూత్రానికి పూర్తి భిన్నం. ఎందుకంటే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీ మ‌హిళ‌ల‌కు ఇస్తోన్న ప్రాధాన్యం దాదాపు శూన్యం. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మంత్రివ‌ర్గం కూర్పులో( 2014లో ) ఒక్క మ‌హిళా మంత్రి లేరు. మ‌హిళా క‌మిష‌న్ వేయ‌డానికి ఐదేళ్లు కేసీఆర్ చాల్లేదు. అంతేకాదు, 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో కేవ‌లం 6 స్థానాల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు టిక్కెట్లు ఇచ్చారు. ఇక 2019 ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి కేవ‌లం న‌లుగురు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే పోటీ చేసే అవకాశం క‌ల్పించారు. లోక్ స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను ఇద్దరికి( క‌విత ఒక‌రు), రాజ్య‌స‌భ ఎంపిక‌లో ఒక్క‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు లేరు. అంటే, మ‌హిళ‌ల‌కు అన్యాయం చేస్తోన్న పార్టీల జాబితాలో మొద‌టి ర్యాంకు బీఆర్ఎస్ పార్టీదే.

Also Read : Kavitha : ఢిల్లీ లిక్క‌ర్లో `లైగ‌ర్`ఆన‌వాళ్లు? తీహార్ జైలు సంద‌డి!

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ ఉన్నారు. ఆయ‌నకు అన్ని ర‌కాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు, ఇచ్చిపుచ్చుకునేలా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ ఇప్పుడు మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ ను అగౌర‌ప‌రుస్తున్నారు. రాజ్యాంగం ప్ర‌కారం ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను కూడా ఇవ్వ‌డంలేదు. అసెంబ్లీ స‌మావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా న‌డిపేసిన ఘ‌న‌త బీఆర్ఎస్ పార్టీది. హెలికాప్ట‌ర్ ఇవ్వ‌కుండా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ని అవ‌మాన‌ప‌రిచారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌసిక్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసుకుంటే, మ‌హిళ‌ల ప‌ట్ల బీఆర్ ఎస్ ఎంత నిర్ల‌క్ష్యంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇలాంటి పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ బిడ్డ క‌విత మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల(Women reservation) కోసం దీక్ష‌కు దిగారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్ర‌స్తావ‌న తీసుకురాని క‌విత ఇప్పుడు ఎందుకు దీక్ష‌కు పూనుకున్నారు? అనేది క‌నీస రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న వాళ్లంద‌రికీ తెలుసు. కానీ, భార‌త‌ క‌మ్యూనిస్ట్ యోధులుగా పేరున్న సీతారాం ఏచూరిలాంటి వాళ్లు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ఆ పార్టీల నైతిక‌త‌ను ప్ర‌శ్నించేలా ఉంది.

తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతోన్న అన్యాయం

తెలంగాణలో నాలుగైదు శాతం టిక్కెట్ల‌ను బీఆర్ఎస్ మ‌హిళ‌ల‌కు కేటాయించ‌లేదు. క‌నీసం ఆ విష‌యాన్ని ప్ర‌శ్నించ‌డానికి కూడా కామ్రేడ్ల‌కు గొంతు రాలేదు. ఢిల్లీలో దీక్ష‌కు దిగిన క‌విత‌ను(Kavitha) అదే వేదిక‌పై నుంచి తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతోన్న అన్యాయంపై ప్ర‌శ్నిస్తే బాగుండేది. లిక్క‌ర్ క్వీన్ గా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన క‌విత‌కు సంఘీభావం తెల‌ప‌డానికి వ‌చ్చిన పెద్ద‌లు తెలంగాణ ప‌రిస్థితిని గుర్తు చేయ‌క‌ పోగా, ఆమెను ప్ర‌శంసించ‌డం క‌మ్యూనిస్ట్ పార్టీ స‌మ‌కాలీన భావ‌జాలం ఏమిటో తెలియ‌చేస్తోంది. ఇదే విష‌యాన్ని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది. అంతేకాదు, ఢిల్లీలో కవిత పోరాటం చిత్తశుద్ధిని నమ్మాలా? అని ష‌ర్మిల నిల‌దీస్తున్నారు. లిక్కర్ స్కాంలో రేపో మాపో అరెస్ట్ కాబోతోందని తెలిసే, ఇప్పుడీ రిజర్వేషన్ల (Women reservation) అంశాన్ని తెరపైకి తెచ్చారని షర్మిల ఆరోపించారు.

జ‌న‌తా ప‌రివార్ పార్టీలు మ‌హిళా రిజ‌ర్వేష‌న్  వ్య‌తిరేకించిన..

మొత్తం 18పార్టీల మద్ధ‌తు ఉంటుంద‌ని క‌విత(Kavitha) గురువారం రోజు ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కానీ, ఆమెకు సంఘీభావంగా నిలిచిన పార్టీల లీడ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే ఆ దీక్ష విఫ‌లం అయింద‌ని ఎవ‌రైనా చెబుతారు. కేవ‌లం సీపీ ఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి మిన‌హా చెప్పుకోద‌గిన లీడ‌ర్లు ఆ వేదిక‌పైన ఎవ‌రూ క‌నిపించ‌లేదు. పైగా క‌విత చెప్పిన స‌మాజ్ వాదీ పార్టీ , ఆర్జేడీ త‌దిత‌ర జ‌న‌తా ప‌రివార్ పార్టీలు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ (Women reservation)బిల్లును పార్ల‌మెంట్ వేదిక‌గా వ్య‌తిరేకించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాంటి పార్టీల సంఘీభావం కోరుకుంటూ కామ్రేడ్ల‌ను ముగ్గులోకి దింపిన బీఆర్ఎస్ చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించడంతో ఢిల్లీ లిక్క‌ర్ వాస‌నలు క‌మ్యూనిస్ట్ లు పూసుకున్నార‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. ఇలాంటి నిర్ణ‌యాల కార‌ణంగా క‌మ్యూనిస్ట్ పార్టీలు ప్ర‌స్తుతం తోక పార్టీ లుగా మారిపోయాయి. ఇప్ప‌టికైనా నైతిక‌త‌, చిత్త‌శుద్ది మేర‌కు న‌డుచుకోవాల‌ని నిజ‌మైన కామ్రేడ్ల వాద‌న‌గా ఉంది.

Also Read : Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు