Site icon HashtagU Telugu

Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్

Hijab Ban

Hijab Ban

Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ నిషేధంపై తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాజాగా సీఎం సిద్ధరామయ్య ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ హిజాబ్‌పై చర్చ మొదలైంది. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేధం లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్‌కు అనుమతి లేదని, మరికొన్ని చోట్ల అంతా మామూలేనని బొమ్మై తెలిపారు.

మరోవైపు హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.

Also Read: TDP : ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోన‌స్ – ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి