Congress Manifesto Committee: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో కమిటీలో తనను చేర్చినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముసాయిదా కమిటీలో సభ్యునిగా నన్ను నియమించినందుకు ఖర్గేకు కృతజ్ఞతలు అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
పార్టీ మేనిఫెస్టో కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేది కాదని, ప్రజలకు చేసే నిబద్ధత అని అన్నారు సీఎం సిద్దరామయ్య. దానిని అమలు చేయడమే నిజమైన పాలన అని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 95 శాతానికి పైగా హామీలను అమలు చేశామని చెప్పారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందామని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలు కూడా కర్ణాటక మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రయోజనాలను పొందుతారని ఆశిస్తున్నానని తెలిపారు.
నా సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కార్యక్రమాలన్నింటికీ మద్దతు ఇచ్చినందుకు పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలకు నేను కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు.