Hindenburg Allegations: హిండెన్‌బర్గ్ కొత్త నివేదికపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. నివేదికలో సెబీ చీఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పై బీజేపీ ఎదురుదాడి చేసింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ మరియు ఆమె భర్త ధవల్ బుచ్‌లపై హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కంగనా వ్యాఖ్యానించారు. దేశం మిమ్మల్ని ఎన్నటికీ నాయకుడిగా ఎన్నుకోదని అన్నారు. అలాగే రాహుల్ ఈ దేశాన్ని నాశనం చేయడమే అతని ఎజెండాగా కనిపిస్తుందని విమర్శించారు కంగనా. దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, రాహుల్ గాంధీ జీవితాంతం ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అని కంగనా దాడి చేశారు
హిండెన్‌బర్గ్ తొలి నివేదిక తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి హిండెన్‌బర్గ్‌కు నోటీసు కూడా పంపారు. అయితే ఈ నోటీసుపై స్పందించకపోగా హిండెన్‌బర్గ్ మళ్లీ నిరాధార ఆరోపణలు చేసిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర అని అన్నారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. ఈ నివేదిక భారత స్టాక్ మార్కెట్ ను కుదిపేసే కుట్ర అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ నివేదిక శనివారం వచ్చిందని, ఆ తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే దాని ప్రభావం కనిపించిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై సెబీ చీఫ్ స్పందించారని ఆయన అన్నారు. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరులను ఉద్దేశించి ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోదీని ద్వేషిస్తూనే, కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ద్వేషించడం ప్రారంభించిందని అన్నారు.
Also Read: Anam Ramnararayana Reddy: మళ్ళీ జలహారతుల పునరుద్ధరణ