Kamal Haasan : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్‌హాసన్‌

    Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని ‘మక్కల్‌ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది. #WATCH | MNM chief and actor Kamal Haasan with Tamil Nadu Minister Udhayanidhi […]

Published By: HashtagU Telugu Desk
Kamal Haasan Reacts On The

Kamal Haasan Reacts On The

 

 

Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని ‘మక్కల్‌ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది.

ఇవాళ (శనివారం) ఉదయం అధికార డీఎంకేతో సమావేశం అనంతరం ‘మక్కల్ నీది మైయమ్‌’ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము డీఎంకేకు మద్దతు ప్రకటించినందుకుగాను వచ్చే ఏడాది తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, శనివారం ఉదయం నటుడు కమల్‌హాసన్‌ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం తమకు మద్దతిస్తే 2025లో ఒక రాజ్యసభ స్థానం ఇవ్వనున్నట్లు డీఎంకే ఆఫర్‌ చేసింది. అందుకు కమల్‌హాసన్‌ అంగీకరించారు.

read also : Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ

  Last Updated: 09 Mar 2024, 02:08 PM IST