Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 03:06 PM IST

 

Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(Makkal Needhi Maiam)అధినేత కమల్ హాసన్ (Kamal Haasan)ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని కమల్ స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని కమల్ వ్యాఖ్యానించారు. డీఎంకే(DMK)తో పొత్తులకు కమల్ సిద్ధమయ్యారని, ఇండియా కూటమిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడులోని అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. కమల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ప్రకటనను కమల్ స్వాగతించారు. ‘పార్టీల పేరుతో చేసే రాజకీయాలకు కాలం చెల్లింది.. దేశం కోసం ఆలోచించాలి.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఎవరితోనైనా ఎంఎన్ఎం జతకడుతుంది.. కానీ స్థానిక భూస్వామ్య రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటుంది.. మేం ఇండియా కూటమిలో చేరలేదు. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైనా శుభవార్త ఉంటే మీ ద్వారా ప్రజలకు చెబుతా.’ని కమల్ వ్యాఖ్యానించారు.

read also : Chintalapudi TDP Incharge : చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జ్ గా రోషన్ కుమార్

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. 2022 సెప్టెంబరులో చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనను కమల్ హాసన్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమిలో చేరేందుకు కమల్ హాసన్ రెండు సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ కూటమిలో కమల్ హాసన్ చేరికతో విజయ్ పార్టీ జోరుకు అడ్డుకట్ట వేయొచ్చని డీఎంకే నేతలు భావిస్తున్నారు.

ఇక, 2018లో పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మూడో కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని.. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులందరూ పరాజయం పొందారు.

Follow us